Hyderabad Metro RTC Common Pass : హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత సరళీకృతం చేస్తూ, ప్రయాణికులకు సులువైన, నిరాటంకమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో ప్రయాణించే పౌరుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC), హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సంయుక్తంగా రూపొందించిన 'మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్'ను ప్రభుత్వం ప్రారంభించింది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు గడ్డం వివేక్ వెంకట్ స్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ లతో కలిసి ఈ నూతన కామన్ పాస్ సేవలను ఇవాళ ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో ఆటో ఛార్జీల సవరణకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో)ను కూడా విడుదల చేశారు.
ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా డబ్బులు చెల్లించి కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రితో సహా మొత్తం 15 మంది మంత్రుల కోసం ఆయన వన్ డే ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు.
అంతేకాకుండా, ఈ కామన్ పాస్ సేవలను స్వయంగా అనుభవించి ప్రయాణికుల స్పందన తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర కేబినెట్ సహచర మంత్రులతో కలిసి ఈ కామన్ పాస్ ద్వారా మెట్రో మరియు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నారు.
పాస్ ధరల వివరాలు:
- ప్రయాణికుల నిత్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రోజువారీ (వన్ డే), నెలవారీ (మంథ్లీ) పాస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
- రోజువారీ కామన్ పాస్ (One Day Pass) : ఈ పాస్ ధరను రూ. 400 గా ఖరారు చేశారు. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ. 300, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి రూ. 100 చొప్పున ఛార్జీలు ఉంటాయి.
- నెలవారీ కామన్ పాస్ (Monthly Pass) : ఈ పాస్ ధరను రూ. 8,500 గా నిర్ణయించారు. ఇందులో మెట్రో వాటా రూ. 7,000 కాగా, ఆర్టీసీ వాటా రూ. 1,500 గా ఉంటుంది.
- స్మార్ట్ కార్డ్ డిపాజిట్ : తొలిసారిగా ఈ పాస్ రూపంలో స్మార్ట్ కార్డును కొనుగోలు చేసేటప్పుడు రూ. 100 డిపాజిట్ వసూలు చేస్తారు. భవిష్యత్తులో కార్డును తిరిగి సమర్పించినప్పుడు ఆ రూ. 100 ను ప్రయాణికుడికి రీఫండ్ (వాపసు) చేస్తారు.
ఈ ఒక్క కామన్ పాస్ చేతిలో ఉంటే చాలు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సరిహద్దుల లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సుల్లోనూ, మెట్రో రైళ్లలోనూ పరిమితి లేకుండా ప్రయాణించవచ్చు. అయితే, విమానాశ్రయానికి నడిచే 'పుష్పక్' ఏసీ బస్సులకు మాత్రం ఈ పాస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే పుష్పక్ బస్సులు మినహా మిగిలిన అన్ని సాధారణ, ఏసీ ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో సర్వీసులకు ఈ పాస్ వర్తిస్తుంది.
{{/usCountry}}ఈ ఒక్క కామన్ పాస్ చేతిలో ఉంటే చాలు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సరిహద్దుల లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సుల్లోనూ, మెట్రో రైళ్లలోనూ పరిమితి లేకుండా ప్రయాణించవచ్చు. అయితే, విమానాశ్రయానికి నడిచే 'పుష్పక్' ఏసీ బస్సులకు మాత్రం ఈ పాస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే పుష్పక్ బస్సులు మినహా మిగిలిన అన్ని సాధారణ, ఏసీ ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో సర్వీసులకు ఈ పాస్ వర్తిస్తుంది.
{{/usCountry}}