...
...
Next Story

IRCTC Tour : అక్టోబర్‌లో ఐఆర్‌సీటీసీ అరుణాచల్‌ప్రదేశ్ టూర్.. 8 రోజులు, అద్భుతమైన ప్రదేశాలు

IRCTC Tour : ఐఆర్‌సీటీసీ బడ్జెట్ ధరలో టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. మీరు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌ వెళ్లాలి అనుకుంటే.. అక్టోబర్‌లో టూర్ ఆపరేట్ చేస్తోంది.

Updated on: Sep 20, 2026, 21:13:10 IST
Advertisement

ఐఆర్‌సీటీసీ అందించే టూర్ ప్యాకేజీలు మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో దొరుకుతాయి. అక్టోబర్ 2వ తేదీన అరుణోదయ అరుణాచల్ ఎక్స్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ఉంటుంది. దిరంగ్, గౌహతి, తవాంగ్, తేజ్‌పూర్‌లాంటి ప్రాంతాలకు చుట్టేసి రావొచ్చు. మెుత్తం 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో ప్రయాణిస్తారు.

మెుదటి రోజు

ఐఆర్‌సీటీసీ అరుణాచల్‌ప్రదేశ్ టూర్
ఐఆర్‌సీటీసీ అరుణాచల్‌ప్రదేశ్ టూర్

ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి గౌహతి చేరుకుంటారు. అక్కడి నుండి తేజ్‌పూర్ (190 కి.మీ)కు ప్రయాణం ఉంటుంది. హోటల్‌లో చెక్ ఇన్ ఉంటుంది. తేజ్‌పూర్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు..

రెండో రోజు

అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్-అవుట్ అవుతారు. దిరాంగ్ (200 కి.మీ)కు బయలుదేరుతారు. మార్గమధ్యలో టిప్పి ఆర్కిడ్ సెంటర్, వేడి నీటి బుగ్గలను సందర్శిస్తారు. మధ్యాహ్నం బొమ్డిలా బౌద్ధ మఠాన్ని సందర్శిస్తారు. దిరాంగ్‌లో రాత్రి బస చేస్తారు.

మూడో రోజు

దిరాంగ్‌లో అల్పాహారం చేసి హోటల్ నుండి చెక్-అవుట్ అవుతారు. తవాంగ్ (130 కి.మీ)కు బయలుదేరుతారు. మార్గమధ్యలో సెలా పాస్, జశ్వంత్ గఢ్ వార్ మెమోరియల్, జంగ్ జలపాతాలను సందర్శిస్తారు. తర్వాత తవాంగ్ చేరుకుని.. హోటల్‌లో బస చేస్తారు.

నాలుగో రోజు

హోటల్‌లో అల్పాహారం చేసి షోంగా-త్సర్ సరస్సును (దీనిని మాధురి సరస్సు అని కూడా పిలుస్తారు) సందర్శిస్తారు. ఆ తర్వాత బుమ్లా పాస్‌కు వెళ్తారు(ఈ సందర్శన భారత సైన్యం అనుమతి, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది; తవాంగ్‌లోని డీసీ కార్యాలయంలో ప్రత్యేక అనుమతులు జారీ చేస్తారు). తవాంగ్‌లో రాత్రి బస చేస్తారు.

ఐదో రోజు

హోటల్‌లో అల్పాహారం చేసి.. చెక్ అవుట్ చేసి దిరాంగ్‌కు బయలుదేరుతారు(130 కి.మీ.). దిరాంగ్ మఠాన్ని సందర్శిస్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసి.. రాత్రి దిరాంగ్‌లో బస చేస్తారు.

ఏడో రోజు

దిరాంగ్‌లో హోటల్‌లో అల్పాహారం చేసి చెక్ అవుట్ చేసి గౌహతికి బయలుదేరుతారు(300 కి.మీ.). హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రి గౌహతిలో బస చేస్తారు.

ఎనిమిదో రోజు

ఉదయాన్నే అల్పాహారం చేసి చెక్ అవుట్ చేయండి. కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ విమానం ఎక్కడానికి గౌహతి విమానాశ్రయంలో దింపుతారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టూర్ బడ్జెట్

సింగిల్ ఆక్యూపెన్సీ రూ. 75,530, డబుల్ ఆక్యూపెన్సీ రూ.56,490, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.53,500, పిల్లలు - పడకతో సహా (5-11 ఏళ్లు) రూ.42420, పిల్లలు - పడక లేకుండా (5-11 ఏళ్లు) రూ.39440, పిల్లలు - పడక లేకుండా(2-4 ఏళ్లు) రూ.23420గా ప్యాకేజీ ధరలు నిర్ణయించారు.

మరిన్ని వివరాల కోసం www.irctctourism.com సందర్శించండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks