...
...
Next Story

IRCTC Tour : ఐఆర్‌సీటీసీ కాఫీ విత్ కర్ణాటక టూర్.. హైదరాబాద్ టూ కూర్గ్, మైసూర్

IRCTC KOFFEE WITH KARNATAKA Tour : ఐఆర్‌సీటీసీ ఈ వేసవిలో ప్రత్యేక ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి కూర్గ్, మైసూర్ ప్రాంతాలకు వెళ్లవచ్చు.

Updated on: May 7, 2026, 10:39:01 IST
Advertisement

ఈ వేసవిలో చల్లని ప్రదేశానికి వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే కర్ణాటకలోని కూర్గ్ మిమ్మల్ని పిలుస్తోంది. అంతేకాదు పక్కనే ఉన్న మైసూర్‌ కూడా వెళ్లి రావొచ్చు. మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో ఈ టూర్‌ను ఐఆర్‌సీటీసీ ఆపరేట్ చేస్తోంది. మే 13వ తేదీన టూర్ ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ బుధవారం ఈ టూర్ ఉంటుంది.

డే 1

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 19:05 గంటలకు రైలు నెం. 12785 (కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్)లో బయలుదేరుతారు. రాత్రి ప్రయాణం చేస్తారు.

డే 2

ఉదయం 09:30 గంటలకు మైసూరు చేరుకుంటారు. కూర్గ్‌కు ప్రయాణం (115 కి.మీ.) చేస్తారు. మధ్యాహ్నానికి కూర్గ్ చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్-ఇన్ చేస్తారు. అబ్బే జలపాతం, ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి కూర్గ్‌లోనే బస చేస్తారు.

డే 3

హోటల్‌లో అల్పాహారం చేస్తారు. తలకావేరి, భాగమండలాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజా సీట్‌ను సందర్శిస్తారు. రాత్రి కూర్గ్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. .

డే 4

హోటల్‌లో అల్పాహారం చేస్తారు. చెక్-అవుట్ చేసి మైసూరుకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో కావేరి నిసర్గధామం, టిబెటన్ మఠాన్ని సందర్శిస్తారు. తరువాత బృందావన్ గార్డెన్స్‌కు వెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ చేసి రాత్రి మైసూరులో బస చేస్తారు.

డే 5

హోటల్‌లో అల్పాహారం చేసి చెక్ అవుట్ చేస్తారు. చాముండి కొండలు, మైసూరు ప్యాలెస్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 15:15 గంటలకు రైలు నెం.12786 ఎక్కడానికి మైసూరు రైల్వే స్టేషన్‌లో దింపుతారు. రాత్రి ప్రయాణం చేస్తారు.

డే 6

కంఫర్ట్(3ఏసీ) సింగిల్ షేరింగ్ ధర రూ.35110, ట్విన్ షేరింగ్ రూ.19750, ట్రిపుల్ షేరింగ్ రూ.15400, చైల్డ్ విత్ బెడ్ రూ.10950, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.9700గా ఉంది.

స్టాండర్డ్(ఎస్ఎల్) సింగిల్ షేరింగ్ రూ.33080, ట్విన్ షేరింగ్ రూ.17720, ట్రిపుల్ షేరింగ్ రూ.13370, చైల్డ్ విత్ బెడ్ రూ.8920, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.7670గా ఉంది.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.irctctourism.com సందర్శించండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe