...
...
Next Story

తెలుగు ప్రయాణికులకు శుభవార్త - అరుణాచలానికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ! లిస్టులో కాంచీపురం, పాండిచ్చేరి

Arunachalam Moksha Yatra Tour Package : తెలుగు భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ 'అరుణాచల మోక్ష యాత్ర' పేరుతో ప్రత్యేక రైలు ప్యాకేజీని ప్రకటించింది. కాచిగూడ నుంచి ప్రతి శుక్రవారం ప్రారంభమయ్యే ఈ యాత్ర… 5 రోజులు ఉంటుంది.

Published on: Aug 5, 2026, 13:19:44 IST
Advertisement

Arunachalam Moksha Yatra Tour Package : ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తీపి కబురు అందించింది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన అరుణాచలం (తిరువణ్ణామలై), కాంచీపురంలతో పాటు అందమైన పుదుచ్చేరిని సందర్శించేందుకు 'అరుణాచల మోక్ష యాత్ర' పేరుతో ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

అరుణాచలం (Image source HT Telugu )
అరుణాచలం (Image source HT Telugu )

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం బయలుదేరే ఈ యాత్ర 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగుతుంది. స్లీపర్, 3ఏసీ తరగతుల్లో ప్రయాణించే వెసులుబాటును ఐఆర్‌సీటీసీ కల్పించింది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఆగస్ట్ 14వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

టూర్ షెడ్యూల్ ఇలా :

  1. మొదటి రోజు (శుక్రవారం ): సాయంత్రం 5:00 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలు నంబర్ 17653 (కాచిగూడ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
  2. రెండో రోజు (శనివారం) : ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి(పాండిచ్చేరి) స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కు వెళ్లి చెక్-ఇన్ అయిన తర్వాత అరవిందాశ్రమం, ఆరోవిల్, ప్రశాంతమైన పారడైజ్ బీచ్‌లను సందర్శిస్తారు. ఆ రాత్రికి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.
  3. మూడో రోజు (ఆదివారం) : ఉదయాన్నే హోటల్‌లో టిఫిన్ ముగించుకుని దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువణ్ణామలై (అరుణాచలం)కి బయలుదేరుతారు. హోటల్‌లో చెక్-ఇన్ అయ్యాక, ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఆ రాత్రికి అరుణాచలంలోనే బస ఉంటుంది.
  4. నాలుగో రోజు (సోమవారం) : ఉదయం టిఫిన్ తర్వాత హోటల్ చెక్-అవుట్ చేసి కాంచీపురం (120 కి.మీ) ప్రయాణమవుతారు. అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం అరక్కోణం స్టేషన్‌కు (30 కి.మీ) చేరుకుని, సాయంత్రం 6:05 గంటలకు రైలు నంబర్ 17651 ద్వారా తిరుగు ప్రయాణం అవుతారు.
  5. ఐదో రోజు (మంగళవారం ): ఉదయం 7:50 గంటలకు రైలు…. కాచిగూడ స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3 ఏసీ), సైట్‌సీయింగ్ కోసం ఏసీ వాహన వసతి (షేరింగ్ ప్రాతిపదికన), రెండు రోజులు హోటల్ బస విత్ బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.

ఈ ప్యాకేజీలో ప్రతి శుక్రవారానికి స్లీపర్‌లో 6 సీట్లు, 3 ఏసీలో 6 సీట్లు మాత్రమే కేటాయించారు. ఆసక్తి ఉన్న భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని లేదా 8287932229 / 8287932228 / 9701360701 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe