...
...
Next Story

IRCTC చార్ ధామ్ యాత్ర : హైదరాబాద్ నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీ - లిస్టులో గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్

IRCTC Chardham Yatra Package : భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం…. 'చార్ ధామ్ యాత్ర' ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ 11 రోజుల పర్యటనలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

Published on: May 11, 2026, 12:22:17 IST
Advertisement

IRCTC Chardham Yatra Package : హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రను దర్శించుకోవాలని ఆకాంక్షించే భక్తుల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఉత్తరాఖండ్‌లోని దివ్య క్షేత్రాలను సందర్శించేలా 'చార్ ధామ్ యాత్ర ఎక్స్ - హైదరాబాద్' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది.

చార్ ధామ్ యాత్ర
చార్ ధామ్ యాత్ర

ఈ ప్యాకేజీలో మొత్తం 10 రాత్రులు, 11 రోజులుగా ఉంటుంది. 2026 మే నెలలో 17, 18, 28వ తేదీల్లో జర్నీలు ఉంటాయి. ఈ తేదీలకు అనుగుణంగా భక్తులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్ చేరుకుని….. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో యాత్రను కొనసాగిస్తారు.

హైదరాబాద్ నుంచి ఉదయం 08:45 గంటలకు బయలుదేరే విమానం (6E 422) ఉదయం 11:15 గంటలకు డెహ్రాడూన్ చేరుకుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు డెహ్రాడూన్ నుంచి సాయంత్రం 05:45 గంటలకు బయలుదేరి రాత్రి 08:15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

టూర్ షెడ్యూల్ వివరాలు:

ఈ పర్యటనలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి నాలుగు ప్రధాన ధామాలతో పాటు హరిద్వార్, రుషికేశ్ వంటి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు.

  • మొదటి రోజు: హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ చేరుకుని, అక్కడి నుంచి బార్కోట్ ప్రయాణం.
  • రెండవ రోజు: జంకీచట్టి మీదుగా యమునోత్రి దర్శనం.
  • మూడవ రోజు: బార్కోట్ నుంచి ఉత్తరకాశీ ప్రయాణం, దారిలో ప్రకాశేశ్వర్ మహాదేవ్ ఆలయ సందర్శన.
  • నాలుగవ రోజు: గంగోత్రి ధామం సందర్శన మరియు పూజా కార్యక్రమాలు.
  • ఐదు, ఆరు రోజులు: గుప్తకాశీ మీదుగా కేదార్‌నాథ్ చేరుకోవడం. కేదార్‌నాథ్‌లో సాయంత్రం హారతి దర్శనంతో పాటు బస.
  • ఏడవ రోజు: కేదార్‌నాథ్ నుంచి గౌరీకుండ్ మీదుగా తిరిగి గుప్తకాశీకి చేరుకోవడం.
  • ఎనిమిదవ రోజు: బద్రీనాథ్ ప్రయాణం మరియు ఆలయ సందర్శన.
  • తొమ్మిదవ రోజు: బద్రీనాథ్ అభిషేకం మరియు భారత చివరి గ్రామమైన 'మాన' సందర్శన.
  • పది, పదకొండ రోజులు: రుద్రప్రయాగ, హరిద్వార్ గంగా హారతి దర్శనం ముగించుకుని తిరిగి డెహ్రాడూన్ కు వస్తారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీలో విమాన టికెట్లు, 10 రాత్రుల వసతి (డెహ్రాడూన్/హరిద్వార్‌లో హోటల్ మరియు కేదార్‌నాథ్‌లో ధర్మశాల వసతి), బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో రవాణా సౌకర్యం ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ , ఒక టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. అయితే…. కేదార్‌నాథ్ వెళ్లేందుకు హెలికాప్టర్, గుర్రం (Pony) లేదా పల్లకీ (Palki) ఖర్చులను యాత్రికులే స్వయంగా భరించాల్సి ఉంటుంది. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెెళ్లి ఈ ప్యాకేజీ వివరాలను తెలుసుకోవటంతో పాటు నేరుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే 040-27702407 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీ పీడీఎఫ్ చూడొచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks