...
...
Next Story

KU Distance Admissions 2026 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - రేపే చివరి తేదీ

KU Distance Admissions 2026 : కాకతీయ యూనివర్సిటీ (జూలై 2026) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువును అక్టోబర్ 13వ తేదీతో ముగియనుంది.

Published on: Oct 12, 2026, 06:38:32 IST
Advertisement

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం (SDLCE/CDOE) ద్వారా జూలై 2026 విద్యా సంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దరఖాస్తు గడువును అక్టోబర్ 13వ తేదీతో ముగియనుంది. ఉన్నత చదువులు చదవాలనుకునే ఉద్యోగులు, విద్యార్థులకు ఇది మంచి అవకాశమని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీ
కాకతీయ యూనివర్సిటీ

ఈ నోటిఫికేషన్ ద్వారా యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. రేపు మాత్రమే మిగిలి ఉండటంతో ఆసక్తిగల వారు.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కోర్సుల వివరాలు:

  • అండర్ గ్రాడ్యుయేషన్ (UG) కోర్సులు : డిగ్రీ స్థాయిలో బీ.ఏ (B.A.), బి.కామ్ జనరల్, బి.కామ్ కంప్యూటర్స్, బి.బి.ఏ (BBA), బి.ఎస్సీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు బీ.ఎల్.ఐ.ఎస్సీలలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులు : పీజీ స్థాయిలో ఎం.ఏ పరిధిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్ డెవలప్‌మెంట్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎం.కామ్ (M.Com), ఎం.ఎస్.డబ్ల్యూ (MSW), హెచ్.ఆర్.ఎమ్, ఎమ్.ఎల్.ఐ.ఎస్సీ (M.LISc) మరియు ఎం.ఎస్సీ విభాగంలో మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జూలాలజీ కోర్సులను అందిస్తున్నారు. అలాగే సాంకేతిక విద్య విభాగంలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులోనూ చేరవచ్చు.
  • డిప్లొమా కోర్సులు : నైపుణ్యాభివృద్ధికి దోహదపడే గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్, మేధో సంపత్తి హక్కుల చట్టాలు , కంప్యూటర్ అప్లికేషన్స్, యోగా, ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్, రూరల్ డెవలప్‌మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • సర్టిఫికెట్ కోర్సులు : ఉపాధి అవకాశాలను పెంచే రీతిలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, పైథాన్ ద్వారా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్, లైఫ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, యోగా, గిరిజన అధ్యయనాలు, శాంతి అధ్యయనాలు ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బయోఇన్ఫర్మాటిక్స్, హ్యూమన్ వాల్యూస్ కోర్సులను ప్రవేశపెట్టారు.
  • ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లు : విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతికతకు పదును పెట్టేందుకు మిమిక్రీ, ప్రాణరక్షణ పద్ధతులపై శిక్షణ ఇచ్చే సిపిఆర్ (CPR), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్యూటీషియన్, మెహందీ డిజైనింగ్, సాంప్రదాయ కళ అయిన పేరిణి నృత్యం వంటి అంశాలలో ప్రత్యేక ఓరియంటేషన్ కోర్సులను అందిస్తున్నారు.

దరఖాస్తు విధానం.....

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks