తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యక్తిగత, నిరాధార వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెబుతూ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే విమర్శలు చేశానని, కేటీఆర్‌ను గానీ ఆయన కుటుంబ సభ్యులను గానీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేస్తూ ఆమె చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

'బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.' అని కొండా సురేఖ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించిన నేపథ్యంలో హఠాత్తుగా కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పడం వెనక రాజకీయ ప్రాధాన్యత ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో సురేఖ మళ్లీ గులాబీ గూటికి చేరుతారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వస్తోంది.
కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన కోర్టులో వేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకునేలా చేయడమే ఈ క్షమాపణల వెనుక ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత చట్టపరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సురేఖ ఈ అడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కొండా సురేఖ బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ తమ పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. కేటీఆర్, పార్టీ గురించిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి నాయకత్వం సుముఖంగా లేదని గులాబీ వర్గాలు పేర్కొంటున్నాయి.
{{/usCountry}}కొండా సురేఖ బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ తమ పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. కేటీఆర్, పార్టీ గురించిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి నాయకత్వం సుముఖంగా లేదని గులాబీ వర్గాలు పేర్కొంటున్నాయి.
{{/usCountry}}మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేశారు. పదవులు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునే పోటీ చేస్తానని ఆమె మీడియా ముఖంగా వెల్లడించారు.
మంత్రి పదవి తొలగించడం, వెంటనే కేటీఆర్‌కు సారీ చెప్పడంతో కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు జోరందుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో కొండా సురేఖ బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. కొండా దంపతుల తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.