Konda Surekha Political Career : ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కొండా కుటుంబం వ్యవహారశైలి, వారి రాజకీయ వ్యూహాలు ఎల్లప్పుడూ తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. స్థానిక సంస్థల స్థాయి నుంచి ఆరంభమైన కొండా సురేఖ రాజకీయ ప్రయాణం రాష్ట్ర కేబినెట్ హోదా వరకు సాగగా…. ఆమె భర్త కొండా మురళి తనదైన శైలిలో క్షేత్రస్థాయి రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు అనేక రాజకీయనాయకులకు భిన్నంగా, సొంత వర్గాన్ని కాపాడుకుంటూ ఈ దంపతులు ముందుకు సాగారు. కొండా మురళి స్థానిక సంస్థల నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించి…. జిల్లా రాజకీయాల్లో తనకంటూ బలమైన ముద్ర వేసుకున్నారు.
ఎంపీపీగా ప్రస్థానం….

స్థానిక సంస్థల ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన కొండా సురేఖ…. గీసుకొండ మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బయటకు వచ్చారు.
రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్ఆర్ అంటే కొండా కుటంబానికి ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన సురేఖ…. జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పదవి రాజనామా చేశారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న సమయంలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించారు. ఆ ఉపఎన్నికలో ఎదురైన స్వల్ప ఓటమి అనంతరం….. ఆమె టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు.
కాలక్రమంలో బీఆర్ఎస్ అధిష్టానంతో తీవ్ర విభేదాలు రావడంతో…. 2018 ఎన్నికలకు ముందు ఆమె తిరిగి సొంత గూడైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కించుకున్నారు.
{{/usCountry}}కాలక్రమంలో బీఆర్ఎస్ అధిష్టానంతో తీవ్ర విభేదాలు రావడంతో…. 2018 ఎన్నికలకు ముందు ఆమె తిరిగి సొంత గూడైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కించుకున్నారు.
{{/usCountry}}అయితే కొద్దిరోజులుగా ఆమె కుమార్తె కొండా సుష్మితా పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి, ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కుటుంబ సభ్యుల రాజకీయ జోక్యం, పార్టీ క్రమశిక్షణా రాహిత్యానికి దారితీసిందన్న కారణంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమె విషయంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. పరిణామాల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఆమెను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించింది.
కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం….
1995 : గీసుకొండ మండల పరిషత్తు అధ్యక్షురాలిగా (MPP) ఎన్నిక
1996 : పీసీసీ (PCC) సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1999 : శాయంపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2004 : శాయంపేట నుంచి రెండోసారి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు.
2009 : పరకాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కేబినెట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు
2014 : బీఆర్ఎస్‌లో చేరటంతో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2018 : బీఆర్ఎస్ పార్టీని విబేధించి…. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. పరకాలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2023 : వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో డిసెంబర్ 7న అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం
2026 సెప్టెంబర్ 3 : తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు.
ఇక కొండా సురేఖ భర్తీ కొండా మురళి వంచనగిరి గ్రామ సర్పంచ్ గా 1987 లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా సురేఖ…. 2026 సెప్టెంబర్ 3న అనూహ్య పరిణామాల నడుమ తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావటం సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఆమె సాగించిన ప్రయాణం… తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. అధినాయకత్వం ఆమెపై వేటు నేపథ్యంలో… కొండా కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.