...
...
Next Story

LPG Cylinder eKYC : మీ గ్యాస్ కనెక్షన్ కు eKYC పూర్తి అయిందా..? లేకపోతే మీ బుకింగ్ రిజెక్ట్..! వెంటనే ఇలా చేయండి

LPG Cylinder eKYC Telangana : ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లకు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని ఆయా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 16 నాటికి అవకాశం ఉండగా…ఈలోపు లబ్ధిదారులు ఈ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.

Published on: Aug 3, 2026, 10:37:08 IST
Advertisement

LPG Cylinder eKYC Telangana : గృహ వినియోగదారులకు సక్రమంగా గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు బోగస్, డూప్లికేట్, దీర్ఘకాలంగా వినియోగంలో లేని కనెక్షన్లను ఏరిపారేయడంపై చమురు కంపెనీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే వినియోగదారుల ఆధార్, బయోమెట్రిక్ వివరాలను అనుసంధానిస్తూ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను విస్తృతంగా అమలు చేస్తున్నాయి.

ఈనెల 16 వరకు గడువు…

గ్యాస్ కనెక్షన్ - ఈకేవైసీ ఉండాల్సిందే (image source HP )
గ్యాస్ కనెక్షన్ - ఈకేవైసీ ఉండాల్సిందే (image source HP )

గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16వ తేదీలోగా ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని చమురు సంస్థలు స్పష్టమైన నిబంధన విధించాయి. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద, డెలివరీ బాయ్స్ వద్ద బయోమెట్రిక్ నమోదు కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే వాస్తవానికి గత నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా…. చమురు కంపెనీలు ఈ నెల 16 వరకు గడువు పొడిగించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 70 శాతం వరకే ఈ-కేవైసీ పూర్తయినట్లు తెలుస్తోంది.

ఎవరి పేరు మీద ఉంటే వారే…

గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటే వారే ఈ కేవైసీ చేయించుకోవాలి. అయితే ఇందులో పలు సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా చనిపోయిన వారి బంధువులు అధికారికంగా వాడుతున్న కనెక్షన్లకు ఇబ్బందయింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న వేలిముద్రలు నమోదు కాని వృద్ధులు కూడా ఉన్నారు. వీళ్లందరికీ ఇప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ కేవైసీ లేకపోతే గ్యాస్ బుకింగ్ అవటం లేదు. ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్నప్పటికీ… రిజెక్ట్ అవుతున్నాయి.

రాష్ట్రం నుంచి చాలా మంది…. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అయితే వీరిలో కనెక్షన్లు ఉన్న వారు కూడా ఉన్నారు. దీంతో వీరి కుటంబ సభ్యులు గ్యాస్ బుకింగ్ కోసం తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. బయోమెట్రిక్ ధృవీకరణ సమయంలో అసలు కనెక్షన్‌దారు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇంటివద్దకు డెలివరీ బాయ్ వచ్చినా బయోమెట్రిక్ వేయలేకపోతుండటంతో ప్రాసెస్ పూర్తికావడం లేదు. పలువురు ఆయా చమురు కంపెనీల యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే విషయంపై హిందుస్థాన్ టైమ్స్ తెలుగు… రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడితో మాట్లాడింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పారు. లేకపోతే గ్యాస్ బుకింగ్ అవ్వదని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ పత్రాలు తీసుకొని వస్తే… నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. బుకింగ్ కానివాళ్లు టెన్షన్ పడొద్దని… ఈకేవైసీ పూర్తి చేయించుకున్న వెంటనే బుకింగ్ సమస్యలు ఉండని స్పష్టం చేశారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న : ఎల్‌పీజీ గ్యాస్ ఈ-కేవైసీ పూర్తి చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?

చమురు సంస్థల నిబంధనల ప్రకారం ఈ నెల 16వ తేదీ నాటికి 100 శాతం ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రశ్న : గ్యాస్ కనెక్షన్ యజమాని మరణిస్తే కనెక్షన్ బదిలీ ఎలా చేయాలి…?

చట్టబద్ధ వారసులు సంబంధిత పత్రాలను సమర్పించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిబంధనల ప్రకారం తమ పేరిట కనెక్షన్ బదిలీ చేయించుకోవచ్చు.

ప్రశ్న : గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలి..?

మీరు కనెక్షన్ తీసుకున్న సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks