...
...
Next Story

PJTAU Agriculture Admissions 2026 : బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు - అగ్రిసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

PJTSAU AGRICET 2026 : ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్-2026 దరఖాస్తు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. అర్హులైన డిప్లొమా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Aug 14, 2026, 19:25:28 IST
Advertisement

వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అగ్రిసెట్ (AGRICET), అగ్రి ఇంజినీరింగ్ సెట్ (AGRIENGGCET)-2026 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 31 (ఆగస్టు 31) వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య తెలిపారు.

బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు

ఈ ప్రవేశ పరీక్షల ద్వారా వర్సిటీ పరిధిలోని బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) కోర్సుల మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

  • PJTSAU, PJTAU, ANGRAU నుంచి అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు లేదా 2025-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా చివరి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అభ్యర్థులకు 2026 డిసెంబర్ 31 నాటికి కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి సాధారణ అభ్యర్థులకు 22 సంవత్సరాలు కాగా, SC, ST అభ్యర్థులకు 25 సంవత్సరాలు, వికలాంగ (PH) అభ్యర్థులకు 27 సంవత్సరాలుగా నిర్ణయించారు.
  • అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ డిప్లొమా కలిగిన అభ్యర్థులు అర్హులు. వీరికి గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలు (SC, STలకు 25 ఏళ్లు, PH అభ్యర్థులకు 27 ఏళ్లు).
  • సర్వీస్ అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యానవన లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు (AEO) కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. వీరి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలుగా సవరించారు.
  • ఓసీ (OC), బీసీ (BC) అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ (SC), ఎస్టీ (ST), వికలాంగ (PH) అభ్యర్థులకు రూ.1000 గా నిర్ణయించారు.
  • ప్రవేశ పరీక్షను 2026 సెప్టెంబర్ 12న ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 గంటల వరకు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్నారు.
  • పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో, ఆఫ్ లైన్ పద్ధతిలో 100 బహుళ ఐచ్ఛిక (MCQ) ప్రశ్నలతో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి కనీసం 40% మార్కులు (SC/ST/PH అభ్యర్థులకు 35%) సాధించాలి.

సందేహాలు లేదా మరింత సమాచారం కోసం అభ్యర్థులు అన్ని పనిదినాల్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మరియు మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య 8332970243 మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం కోసం https://pjtau.edu.in వెబ్‌సైట్‌ను చూడాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe