...
...
Next Story

పండగల వేళ ప్రయాణికుల రద్దీ... సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు ప్రకటన! హాల్ట్ లిస్ట్ ఇదే

దసరా పండుగ రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ వివరాలను దక్షిణ కోస్తా రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Published on: Oct 18, 2026, 05:12:44 IST
Advertisement

పండుగల సీజన్‌లో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైలు సర్వీసును (Train No. 07071 / 07072) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

  • సికింద్రాబాద్ – విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ( నెంబర్ 07071) : ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 18 (ఆదివారం) రాత్రి 20:15 గంటలకు (రాత్రి 8:15) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు, అంటే అక్టోబర్ 19 (సోమవారం) మధ్యాహ్నం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
  • విశాఖపట్నం – సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (నెంబర్ 07072) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ 19 (సోమవారం) మధ్యాహ్నం 15:50 గంటలకు (మధ్యాహ్నం 3:50) విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు, అక్టోబర్ 20 (మంగళవారం) ఉదయం 07:05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ముఖ్యమైన స్టేషన్లు (ఆగు స్థానాలు):

సికింద్రాబాద్ - విశాఖ ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ - విశాఖ ప్రత్యేక రైళ్లు

ఇరు మార్గాల్లోనూ ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, గుంటూరు, కృష్ణాకెనాల్ , విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 బోగీలు ఉంటాయి.

  • ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ : 01 కోచ్

• స్లీపర్ క్లాస్ : 17 కోచ్‌లు

• జనరల్ సెకండ్ క్లాస్ : 02 కోచ్‌లు

• సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ కోచ్ : 02 కోచ్‌లు

పండుగ వేళ ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సౌత్ కోస్ట్ రైల్వే విజ్ఞప్తి చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks