హోలీ పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.చర్లపల్లి–దానాపూర్, యశ్వంత్‌పూర్–హజరత్ నిజాముద్దీన్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు…
- దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం…. ఈ నెల 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో చర్లపల్లి– దానాపూర్ (07091) మధ్య ప్రత్యేక రైళ్లు ఉంటాయి. మధ్యాహ్నం చర్లపల్లి నుంచి బయల్దేరి…మరునాడు రాత్రి 11.55 గంటలకు దానాపూర్ చేరుకుంటాయి.
- ఈ నెల 25, మార్చి 1, 5, 9న దానాపూర్–చర్లపల్లి (07092) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్ తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు దానాపూర్ నుంచి బయల్దేరి… మరునాడు ఉదయం 10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయి.
- ఫిబ్రవరి 28వ తేదీన చర్లపల్లి–దానాపూర్ (07093) మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మార్చి 2వ తేదీన దానాపూర్–చర్లపల్లి(07094) వెళ్లే ఎక్స్‌ప్రెస్, మార్చి 1న చర్లపల్లి–దానాపూర్ (07095) మధ్య ప్రత్యేక రైళ్లు ఉంటాయి.
- చర్లపల్లి నుంచి బ్రహ్మపూర్(07027) మధ్య మార్చి 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 9.30 గంటలకు బరంపూర్ కు చేరుకుంటాయి.
- ఇక బ్రహ్మపూర్ నుంచి చర్లపల్లి(07028) మధ్య మార్చి 7,14, 21, 28 తేదీల్లో ఉదయం 11.30 గంటలకు బ్రహ్మపూర్ నుంచి బయలేరుతాయి. ఈ ప్రత్యేక రైళ్లు మరునాడు ఉదయం 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, ఇచ్చాపురం వంటి స్టేషన్ల మీదుగా వెళ్తాయి.
- ఫిబ్రవరి 25వ తేదీన యశ్వంత్‌పూర్– హజరత్ నిజాముద్దిన్ (ట్రైన్ నెంబర్ 06569) స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇక మార్చి మార్చి 1వ తేదీన హజరత్‌నిజాముద్దిన్– యశ్వంత్‌పూర్ (06570) మధ్య మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు యలహంక, ధర్మవరం, అనంతపురం, ధోన్, కర్నూలు నగరం, కాచిగూడ, కాజీపేట, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, బినా, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర జంక్షన్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}