తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. కొత్తగా విద్యుత్ కనెక్షన్ పొందాలనుకునే పౌరులకు ప్రక్రియను అత్యంత సరళతరం చేసింది. ఇకపై విద్యుత్ లైన్‌మన్లు లేదా విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా…. ఇంట్లో నుంచేTGSPDCL అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటూ, కనెక్షన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకోవడానికి TGSPDCL అనుసరించాల్సిన 7 సులభమైన దశలను స్పష్టంగా వివరించింది.
కొత్త కనెక్షన్ పొందే దశలు :
- మొబైల్ నమోదు: మీ చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకుని దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి.
- వివరాల ఎంపిక : మీ అవసరాలకు తగినట్లుగా విద్యుత్ వినియోగ కేటగిరీ (గృహ, వాణిజ్య లేదా పరిశ్రమలు), సరఫరా రకం, కావాల్సిన విద్యుత్ లోడ్ (Load in kW/HP) వివరాలను ఎంచుకోండి.
- పత్రాల అప్‌లోడ్ : గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ మొదలైనవి), యాజమాన్య హక్కులు లేదా నివాస ధ్రువీకరణ పత్రాలను (ఓనర్షిప్ డాక్యుమెంట్లు/రెంట్ అగ్రిమెంట్) స్పష్టంగా అప్‌లోడ్ చేయండి.
- అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన : మీరు సమర్పించిన పత్రాలను విద్యుత్ శాఖ అధికారులు పరిశీలిస్తారు. అలాగే మీ ప్రాంతంలో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని సాంకేతికంగా తనిఖీ చేస్తారు.
- అంచనా వ్యయం తెలుసుకోవడం : అధికారుల పరిశీలన అనంతరం, లైన్ విస్తరణ లేదా కొత్త మీటర్ ఏర్పాటుకు అవసరమైన అంచనా వ్యయం, ప్రభుత్వ రుసుముల వివరాలను తెలుసుకోండి.
- రుసుముల చెల్లింపు - ఒప్పందం : నిర్ణయించిన అధికారిక రుసుములను ఆన్‌లైన్ ద్వారా చెల్లించి, ఒప్పంద పత్రాలు, తనిఖీ ప్రక్రియను పూర్తి చేయండి.
- మీటర్ ఏర్పాటు - సర్వీసు ప్రారంభం : క్షేత్రస్థాయి పనులు, కొత్త డిజిటల్ మీటర్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ ప్రాంగణానికి అధికారికంగా విద్యుత్ సర్వీసు కనెక్షన్ అందుబాటులోకి వస్తుంది.
కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే పౌరులకు TGSPDCL కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. సంస్థ నుంచి విద్యుత్ సర్వీసు అధికారికంగా మంజూరై…. మీటర్ అమర్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త కనెక్షన్‌ను లేదా అదనపు లోడ్‌ను వినియోగించకూడదని స్పష్టం చేసింది.
{{/usCountry}}కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే పౌరులకు TGSPDCL కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. సంస్థ నుంచి విద్యుత్ సర్వీసు అధికారికంగా మంజూరై…. మీటర్ అమర్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త కనెక్షన్‌ను లేదా అదనపు లోడ్‌ను వినియోగించకూడదని స్పష్టం చేసింది.
{{/usCountry}}అలాగే…. కనెక్షన్ ఇప్పిస్తామని నమ్మబలికే దళారులు, మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించవద్దని హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్ లేదా వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన అధికారిక రుసుములను మాత్రమే చెల్లించాలని సూచించింది.
ఏదైనా సాయం లేదా సందేహాల కోసం వినియోగదారులు TGSPDCL అధికారిక వెబ్‌సైట్ http://tgsouthernpower.org ను సందర్శించవచ్చు. రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నంబర్ 1912 కు కాల్ చేసి తగిన సమాచారం పొందొచ్చు.