...
...
Next Story

సికింద్రాబాద్ మహంకాళి బోనాలు 2026 : నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు - రూట్ మ్యాప్, ఫ్రీ పార్కింగ్ వివరాలు ఇవే!

ఆగస్టు 2 నుండి 4 వరకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. మళ్లింపులు, పార్కింగ్ స్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిటీ పోలీసులు వెల్లడించారు.

Published on: Aug 2, 2026, 07:30:34 IST
Advertisement

Secunderabad Mahankali Bonalu 2026 : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతరకు నగర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను అమల్లోకి తెచ్చారు.

అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు…

సికింద్రాబాద్ మహంకాళి బోనాలు 2026
సికింద్రాబాద్ మహంకాళి బోనాలు 2026

ఆగస్ట్ 1 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు…. ఆగస్టు 4వ తేదీ ఉదయం 3:00 గంటల వరకు అమల్లో ఉంటాయి. మహంకాళి ఆలయానికి సమీపంలో ఉన్న పొగాకు బజార్, హమాలీ విగ్రహం, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ తదితర రహదారుల్లోకి సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

జాతర సమయంలో రద్దీని నివారించేందుకు ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బాలా, ఘాస్‌మండి, బైబిల్ హౌస్, సీటీఓ, సంగీత్, వైఎంసీఏ, ఎస్‌బీఐ క్రాస్ రోడ్స్ తదితర ప్రధాన కూడళ్ల వద్ద స్థానిక రద్దీని బట్టి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. వాహనదారులు ఈ మార్గాల గుండా ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భక్తుల కోసం ఉచిత పార్కింగ్ స్థలాలు:

మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల కోసం పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. క్రింద పేర్కొన్న ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయవచ్చు….

  • హరిహర కళాభవన్
  • మహబూబ్ కాలేజీ
  • సీఎంఆర్ మాల్
  • జింఖానా గ్రౌండ్
  • స్వప్నలోక్ కాంప్లెక్స్
  • వెస్లీ కాలేజ్
  • నల్లగుట్ట జీహెచ్‌ఎమ్‌సీ గ్రౌండ్
  • ఇస్లామియా హైస్కూల్
  • ఓల్డ్ జైలు ఖానా ఖాళీ స్థలం

ప్రయాణికులు లేదా భక్తులకు ఏవైనా అత్యవసర సమస్యలు ఎదురైతే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించవచ్చు. అలాగే…. తాజా ట్రాఫిక్ అప్‌డేట్‌లు, రద్దీ వివరాల కోసం అధికారిక సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌లో @HYDTP, 'ఎక్స్' (ట్విట్టర్)లో @HYDP ఖాతాలను అనుసరించాలని పోలీసులు కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe