CBG Plants in AP: రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు - రూ. 60 కోట్లు మంజూరు, ఎక్కడెక్కడంటే..?
Biogas Plants in Andhra pradesh : రాష్ట్రంలోని 5 పట్టణ స్థానిక సంస్థలలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం…. రూ. 60 కోట్లు మంజూరు చేసింది.
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 5 పట్టణ ప్రాంతాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఘన వ్యర్థాల ఆధారిత బయో-ఎనర్జీ మౌలిక సదుపాయాలను కార్యరూపంలోకి తీసుకురానుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం శనివారం ప్రభుత్వం రూ. 60 కోట్లను మంజూరు చేసింది.

5 ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు….
రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు మరియు ఒంగోలులలో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయి. వీటితో పాటు విజయవాడలో ఉన్న పాత ప్లాంట్‌ను పునరుద్ధరించి…. ఆధునీకరిస్తారు.
ప్రతి ప్లాంట్ రోజుకు 25 టన్నుల (TPD) వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తం ఐదు నగరాల్లో కలిపి రోజుకు 125 టన్నుల వ్యర్థాలను వినియోగిస్తారు.
హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సలహాదారుగా వ్యవహరించనుంది.
బయోగ్యాస్ తో ప్రయోజనాలు:
ఈ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు వల్ల అనేక ప్రయోజనాలుంచాయి. నగరాల్లో పేరుకుపోతున్న ఘన వ్యర్థాల సమస్య తగ్గుతుంది. ఘన వ్యర్థాల నుంచి తయారయ్యే బయోగ్యాస్‌ను ఇంధనంగా వాడుకోవచ్చు. గ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలే వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా ఉపయోగించవచ్చు. వీటి పంట పొలాల్లో వినియోగిస్తారు.
- పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో పోలిస్తే బయో గ్యాస్ తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇది పర్యావరణాన్ని దెబ్బతియదు.
- పెట్రోల్, డీజిల్ మరియు ఎల్‌పీజీ (LPG) ధరలతో పోలిస్తే కంప్రెస్డ్ బయోగ్యాస్ చౌకగా లభిస్తుంది. ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాల సేకరణ మరియు రవాణా విభాగాల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు.
- బయోగ్యాస్ వ్యర్థాల వాడకం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.
- బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ ను వంట గ్యాస్‌గా, వాహనాల్లో ఇంధనంగా (Bio-CNG), మరియు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

