...
...
Next Story

ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు, హాల్ట్ స్టేషన్ల లిస్ట్ ఇదే

పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిన్ సుకియా - బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Published on: Sep 29, 2026, 12:16:30 IST
Advertisement

పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని న్యూ తిన్‌సుకియా నుంచి బెంగళూరులోని SMVT మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా చెరో 6 సర్వీసుల చొప్పున మొత్తం 12 ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు
ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వేలాది మంది ప్రయాణికులకు, ముఖ్యంగా బెంగళూరు వైపు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, సింహాచలం నార్త్, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

ట్రైన్ టైమింగ్స్…

న్యూ తిన్‌సుకియా - SMVT బెంగళూరు ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (ట్రైన్ నంబర్: 05952) : ఈ రైలు న్యూ తిన్‌సుకియాలో గురువారం సాయంత్రం 18:45 గంటలకు బయలుదేరి, నాల్గవ రోజు (ఆదివారం) ఉదయం 09:30 గంటలకు SMVT బెంగళూరు చేరుకుంటుంది.

  • సర్వీసు తేదీలు (గురువారాలు): అక్టోబర్ 08, 15, 22, 29 మరియు నవంబర్ 05, 12 తేదీల్లో నడుస్తుంది.

SMVT బెంగళూరు - న్యూ తిన్‌సుకియా ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (ట్రైన్ నంబర్: 05951): తిరుగు ప్రయాణంలో ఈ రైలు SMVT బెంగళూరులో సోమవారం అర్ధరాత్రి 00:05 గంటలకు (ఆదివారం దాటాక) బయలుదేరి, మూడవ రోజు (బుధవారం) సాయంత్రం 16:25 గంటలకు న్యూ తిన్‌సుకియా చేరుకుంటుంది.

  • సర్వీసు తేదీలు (సోమవారాలు): అక్టోబర్ 12, 19, 26 మరియు నవంబర్ 02, 09, 16 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

హాల్టింగ్ స్టేషన్లు…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks