AP Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం: ఇవాళ ఈ జిల్లాలకు వర్ష సూచన!

AP Weather Updates : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విశాఖ సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. 

Published on: Jul 26, 2026, 06:54:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Weather Updates : బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతం పరిధిలోని పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరాల సమీపంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

ఈ అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు లేకపోయినా…. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వాతావరణం మారి వర్షాలు పడే వీలుంది.

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

అల్పపీడన ప్రభావంతో ఇవాళ (జూలై 26, 2026) రాష్ట్రంలోని పలు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని అంచనా.

ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని…. వర్షం పడే సమయంలో పాత భవనాలు, చెట్ల కింద నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పిడుగుల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More