...
...
Next Story

శబరిమల భక్తులకు అప్డేట్ - తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు, రూట్ల వారీగా వివరాలు

శబరిమల భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్, జనవరి 2027లో రైల్వేశాఖ మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. హైదరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, కాజీపేట, కొల్లాం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Published on: Nov 26, 2026, 16:29:47 IST
Advertisement

శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు, భక్తులకు ప్రయాణ కష్టం కలగకుండా డిసెంబర్ 2026, జనవరి 2027 నెలల్లో 'ట్రైన్ ఆన్ డిమాండ్' (TOD) ప్రాతిపదికన ప్రత్యేక శబరి రైళ్లు నడపనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ మీదుగా సాగే ఈ రైళ్లతో వేలాది మంది భక్తులకు ఎంతో ఊరట దక్కనుంది.

హైదరాబాద్ దక్కన్ – కొల్లాం – కాజీపేట ప్రత్యేక రైళ్లు (07187 / 07188) :

  • తాండూరు, రాయచూరు, గుంతకల్ మార్గంలో ఈ రైళ్లను రెండు ట్రిప్పుల చొప్పున నడుపుతారు.
  • డిసెంబర్ 4, డిసెంబర్ 18 (శుక్రవారాలు) ఉదయం 9:00 గంటలకు హైదరాబాద్ దక్కన్ నుంచి( రైలు నెంబర్ - 07187) బయలుదేరుతుంది. మరుసటి రోజు శనివారం సాయంత్రం 4:55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 5, డిసెంబర్ 19 (శనివారాలు) రాత్రి 7:30 గంటలకు కొల్లాం నుంచి(రైలు నెంబర్ 07188) బయలుదేరి…. సోమవారం ఉదయం 7:00 గంటలకు కాజీపేట చేరుకుంటుంది.

సిర్పూర్ కాగజ్‌నగర్ – కొల్లాం – హైదరాబాద్ దక్కన్ రైళ్లు (07171 / 07172) :

  • సికింద్రాబాద్, వికారాబాద్, రాయచూరు, గుంతకల్ మీదుగా ఈ రైళ్లు రెండు ట్రిప్పులు నడుస్తాయి.
  • డిసెంబర్ 11, డిసెంబర్ 25 (శుక్రవారాలు) తెల్లవారుజామున 4:00 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి రైలు (నెంబర్ 07171) బయలుదేరుతుంది. మరుసటి రోజు శనివారం సాయంత్రం 4:55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో 07172 నంబర్ రైలు డిసెంబర్ 12, డిసెంబర్ 26 (శనివారాలు) రాత్రి 7:30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరుతుంది. సోమవారం తెల్లవారుజామున 4:00 గంటలకు హైదరాబాద్ దక్కన్ చేరుకుంటుంది.

హైదరాబాద్ దక్కన్ – కొల్లాం రైళ్లు (07173 / 07174)

  • సికింద్రాబాద్, వికారాబాద్, రాయచూరు, గుంతకల్ మార్గంలో జనవరిలో మూడు ట్రిప్పుల చొప్పున ఈ రైళ్లు నడుస్తాయి.
  • 07173 నంబర్ రైలు జనవరి 1, జనవరి 8, జనవరి 15 (శుక్రవారాలు) ఉదయం 9:00 గంటలకు హైదరాబాద్ దక్కన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు శనివారం సాయంత్రం 4:55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో 07174 నంబర్ రైలు జనవరి 2, జనవరి 9, జనవరి 16 (శనివారాలు) రాత్రి 7:30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరుతుంది. సోమవారం తెల్లవారుజామున 4:00 గంటలకు హైదరాబాద్ దక్కన్ చేరుకుంటుంది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లలో మొత్తం 24 కోచ్‌లు ఉంటాయి. వాటిలో 1ఏసీ కోచ్ 1, 2ఏసీ కోచ్‌లు 2, 3ఏసీ కోచ్‌లు 6, స్లీపర్ కోచ్‌లు 9, జనరల్ కోచ్‌లు 4, జనరల్ సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్‌లు 2 ఉంటాయి.

ఈ రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్డు, పిలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుపూర్, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సెరి, తిరువల్ల, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం, కరునాగపల్లి, శాస్తంకోట స్టేషన్లలో ఆగుతాయి. సిర్పూర్ కాగజ్‌నగర్ రైలుకు అదనంగా బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లు ఉంటాయి.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks