SCR Summer Special Trains : వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట - నిజాముద్దీన్ మరియు విజయవాడ - ఫరీదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి.

కాజీపేట – నిజాముద్దీన్ : కాజీపేట నుంచి నిజాముద్దీన్ వెళ్లే రైలు (నెం. 07662) మే 22, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం 13.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు శనివారం రాత్రి 23.40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నిజాముద్దీన్ - కాజీపేట రైలు (నెం. 07663) మే 25, 2026 (సోమవారం) తెల్లవారుజామున 03.40 గంటలకు బయలుదేరి…. మంగళవారం ఉదయం 11.00 గంటలకు కాజీపేట చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు బలార్షా, చంద్రపూర్, సేవగ్రామ్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో రెండు దిశలలోనూ ఆగుతాయి. ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
విజయవాడ – ఫరీదాబాద్ : విజయవాడ నుంచి ఫరీదాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (నెం. 07664) మే 22, 2026 (శుక్రవారం) తెల్లవారుజామున 05.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 14.50 గంటలకు ఫరీదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫరీదాబాద్ - విజయవాడ రైలు (నెం. 07665) మే 25, 2026 (సోమవారం) తెల్లవారుజామున 01.10 గంటలకు బయలుదేరి… మంగళవారం మధ్యాహ్నం 13.00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, బలార్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో కూడా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, బలార్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో కూడా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
{{/usCountry}}