...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన సూపర్ హిట్ సిరీస్ ప్రీక్వెల్- 100 ఏళ్ల నాటి చరిత్రతో- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడంటే?

ఓటీటీ సిరీస్‌ల్లోనే గ్లోబల్ సెన్సేషన్‌గా నిలిచిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ సూపర్ హిట్ సిరీస్ నుంచి ప్రీక్వెల్‌గా ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 19, 2026, 15:08:38 IST
Advertisement

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (GoT). గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచాన్ని మరింతగా విస్తరించి హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్స్ అనే మరో ఓటీటీ సిరీస్‌ను జీవోటీ అభిమానుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసింది.

సరికొత్త ప్రీక్వెల్

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన సూపర్ హిట్ సిరీస్ ప్రీక్వెల్- 100 ఏళ్ల నాటి చరిత్రతో- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన సూపర్ హిట్ సిరీస్ ప్రీక్వెల్- 100 ఏళ్ల నాటి చరిత్రతో- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడంటే?

ఇప్పుడు ఇదే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ నుంచి ప్రీక్వెల్‌గా మరో ఓటీటీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అదే ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’ (A Knight of the Seven Kingdoms). జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ రాసిన ‘టేల్స్ ఆఫ్ డంక్ అండ్ ఎగ్’ నవలల ఆధారంగా ఈ సరికొత్త ప్రీక్వెల్ ఓటీటీ సిరీస్ తెరకెక్కింది.

మనం ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో చూసిన సంఘటనలకు సుమారు వంద ఏళ్ల (100 ఏళ్ల చరిత్రతో) ముందు, అలాగే ‘హౌజ్ ఆఫ్ ది డ్రాగన్’ తర్వాత జరిగిన కథ ఇది. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు ప్రీక్వెల్‌తోపాటు హౌజ్ ఆఫ్ ది డ్రాగన్‌కు సీక్వెల్ అన్నమాట.

టార్గేరియన్ వంశస్థుల కథ

ఈ రెండింట్లో చూసిన టార్గేరియన్ వంశస్థులు ఇంకా సింహాసనాన్ని ఏలుతున్న కాలం అది. ఒక సాదాసీదా వీరుడు (హెడ్జ్ నైట్‌గా పిలవబడే) ‘సర్ డన్కన్ ది టాల్’, అతని చిన్నారి సహాయకుడు (స్క్వైర్ అని పిలుస్తారు) ‘ఎగ్’ కలిసి వెస్ట్రోస్ ఖండంలో చేసే సాహసయాత్రే ఈ సిరీస్ ప్రధాన అంశం.

ఇంతటీ క్రేజీ సిరీస్ అయిన ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ఇండియన్ కాలమానం ప్రకారం ఇవాళ (జనవరి 19) ఉదయం 8:30 గంటలకు జియో హాట్‌స్టార్‌లో ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ రిలీజ్ అయింది.

అది కూడా తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇవాళ కేవలం ఒక్క ఎపిసోడ్‌ను మాత్రమే ప్రసారం చేశారు మేకర్స్. మొదటి ఎపిసోడ్‌కు ‘ది హెడ్జ్ నైట్’ (The Hedge Knight) అని పేరు పెట్టారు. దీని నిడివి దాదాపు 42 నిమిషాలు.

మొత్తం 6 ఎపిసోడ్స్‌తో

ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ మొత్తం 3 సీజన్స్‌తో రానుంది. తాజాగా ఓటీటీ రిలీజ్ అయిన ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ మొదటి సీజన్‌లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి సోమవారం ఉదయం ఒక కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది.

ఎపిసోడ్స్ రిలీజ్ డేట్స్

ఎపిసోడ్ 1: జనవరి 19 (స్ట్రీమింగ్ అవుతోంది)

ఎపిసోడ్ 2: జనవరి 26

ఎపిసోడ్ 3: ఫిబ్రవరి 2

ఎపిసోడ్ 4: ఫిబ్రవరి 9

ఎపిసోడ్ 5: ఫిబ్రవరి 16

ఎపిసోడ్ 6: ఫిబ్రవరి 23 (మొదటి సీజన్ ముగింపు)

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఇదిలా ఉంటే, ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ సిరీస్‌లో పీటర్ క్లాఫీ (సర్ డన్కన్), డెక్‌స్టర్ సోల్ అన్సెల్ (ఎగ్) ప్రధాన పాత్రల్లో నటించారు. డేనియల్ ఇంగ్స్, సామ్ స్ప్రుయెల్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు.

టార్గేరియన్స్ వంద ఏళ్ల చరిత్రతో వచ్చిన ఈ సిరీస్‌లో డ్రాగన్ల అరుపులు, సింహాసనం కోసం కుట్రలు మాత్రమే కాకుండా.. ఒక నిజమైన వీరుడి ప్రయాణం ఎలా ఉంటుందో చూపించనున్నారు. డ్రామాతో అడ్వెంచర్స్ ఇష్టపడేవారు జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks