Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నిజానికి ఈ శుక్రవారం (అక్టోబర్ 9, 2026) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది.
ఆదర్శ కుటుంబం రిలీజ్

వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి గురూజీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఎలా తీర్చుదిద్దుతున్నారనే క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఈ మూవీ రిలీజ్ ను పదే పదే పోస్ట్ పోన్ చేయడం నిరాశ కలిగిస్తోంది. ముందు 2026 సమ్మర్, ఆ తర్వాత అక్టోబర్ 2, అనంతరం అక్టోబర్ 9.. ఇలా సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు.
కొత్త రిలీజ్ డేట్ ఏంటీ?
అక్టోబర్ 9న కచ్చితంగా ఆదర్శ కుటుంబం మూవీని థియేటర్లకు తీసుకొస్తామని మొన్నటివరకూ మేకర్స్ బలంగా చెప్పారు. కానీ ఈ డేట్ కు కూడా తీసుకురాలేమని తాజాగా ప్రకటించారు. మరోసారి మూవీ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నిర్మాత నాగవంశీ ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో మునిగిపోయారు.
తమన్ ట్వీట్ తో
అయితే, ఈ నిరాశను పటాపంచలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ సినిమా రీ-రికార్డింగ్ పనుల గురించి అప్‌డేట్ ఇస్తూ, పొరపాటున కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో రాసేశారు. ఆ ట్వీట్ ప్రకారం సినిమా అక్టోబర్ 30, 2026న విడుదల కాబోతున్నట్లు లీక్ అయింది.
ఆ తర్వాత తమన్ వెంటనే అప్రమత్తమై ఆ డేట్‌ను డిలీట్ చేసి, పోస్ట్‌ను ఎడిట్ చేశారు. అయితే అప్పటికే నెటిజన్లు ఎడిట్ హిస్టరీ ద్వారా అసలు విషయాన్ని కనిపెట్టేశారు.
ఫ్యాన్స్ ఖుష్
{{/usCountry}}ఆ తర్వాత తమన్ వెంటనే అప్రమత్తమై ఆ డేట్‌ను డిలీట్ చేసి, పోస్ట్‌ను ఎడిట్ చేశారు. అయితే అప్పటికే నెటిజన్లు ఎడిట్ హిస్టరీ ద్వారా అసలు విషయాన్ని కనిపెట్టేశారు.
ఫ్యాన్స్ ఖుష్
{{/usCountry}}ఈ ఊహించని లీక్‌తో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అక్టోబర్ చివరి శుక్రవారం నాడు 'ఆదర్శ కుటుంబం' థియేటర్లలో సందడి చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. ఈ కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి త్వరలోనే ఒక అఫీషియల్ పోస్టర్ వచ్చే అవకాశం ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.