...
...
Next Story

Horror TV Premiere: ఓటీటీలో 100 మిలియన్ వ్యూస్-టీవీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్-ఆవును చంపేందుకు ఏకమయ్యే ఊరు!

OTT Horror Thriller Shambhala TV Premiere Date: ఓటీటీలో సూపర్ హిట్ అయిన తెలుగు హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా శంబాల టీవీలోకి వచ్చేయనుంది. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల ఓటీటీలో మంచి వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇప్పుడు శంబాల టీవీ ప్రీమియర్ డేట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Published on: Mar 5, 2026, 14:12:41 IST
Advertisement

థియేటర్లలో సూపర్ హిట్ అయిన, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు అన్నీ ఓటీటీ బాట పడుతుంటాయి. ఓటీటీలోనూ కొన్ని సినిమాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మరికొన్ని మాత్రం ట్రోలింగ్ బారిన పడుతుంటాయి. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ అనంతరం బుల్లితెరపై సందడి చేస్తుంటాయి ఆ సినిమాలు.

ఓటీటీలో సూపర్ హిట్

ఓటీటీలో 100 మిలియన్ వ్యూస్-టీవీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్-ఆవును చంపేందుకు ఏకమయ్యే ఊరు!
ఓటీటీలో 100 మిలియన్ వ్యూస్-టీవీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్-ఆవును చంపేందుకు ఏకమయ్యే ఊరు!

అలా ఓటీటీలో సూపర్ హిట్ అయిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు టీవీ ప్రీమియర్ కానుంది. ఆ సినిమా ఏంటీ, అందులోని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బ్లాక్ బస్టర్ హిట్‍‌తో జీ తెలుగు

వారం వారం సూపర్​ హిట్​ సినిమాలను అందిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో బ్లాక్‌ బస్టర్​ హిట్​ సినిమాతో వచ్చేస్తోంది. ఆది సాయి కుమార్​, అర్చనా అయ్యర్ ​నటించిన తెలుగు హారర్ ఫాంటసీ మిస్టికల్​ థ్రిల్లర్ సినిమా​ శంబాల. ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

శంబాల టీవీ ప్రీమియర్ డేట్

యుగంధర్​ ముని దర్శకత్వంలో సైన్స్​, చరిత్ర ఆధారంగా రూపొందిన సైంటిఫిక్​ థ్రిల్లర్ శంబాల వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్‌గా రానుంది. మార్చి 8 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో శంబాల టీవీ ప్రీమియర్ కానుంది. తాజాగా శంబాల బుల్లితెర రిలీజ్‌ను జీ తెలుగు ప్రకటించింది.

ఊరంతా ఏకమై

ఊరందరినీ వారించి ఆవుని కాపాడతాడు విక్రమ్. ఆ తరువాత ఆ ఊరిలో వరుస హత్యలు జరుగుతూ వస్తాయి. అసలు శంబాల అనే ఊరికి ఏమైంది? అసలు వరుస హత్యలు ఎందుకు జరుగుతాయి? ఉల్క కారణంగానే ఆ ఊరిలో ఈ హత్యలు జరిగాయా? చివరికి విక్రమ్ ఆ ఊరి వారందరినీ ఆ హత్యల బారి నుంచి ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే జీ తెలుగు వేదికగా ప్రసారమయ్యే శంబాల సినిమా చూడాల్సిందే!

శంబాల నటీనటులు

ఆది సాయి కుమార్, అర్చన ఐయర్ ప్రధాన పాత్రల్లో నటించిన శంబాల సినిమాలో మలయాళ భామ స్వాసిక విజయన్, మధునందన్, రవి వర్మ, ఇంద్రనీల్, మీసాల లక్ష్మణ్, శిజు మేనన్, హర్ష వర్ధన్, శివ కార్తిక్, శైలజా ప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

నమ్మకం, ద్రోహం, కుట్రల మధ్య, సైన్స్‌కు మూఢ నమ్మకానికి మధ్య ఉత్కంఠగా సాగే శంబాల సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని జీ తెలుగు అనౌన్స్ చేసింది. కాగా, ఇదివరకే ఆహాలో శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

100 మిలియన్‌కుపైగా వ్యూస్

ఓటీటీ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది శంబాల. అలాంటి శంబాల టీవీ ప్రీమియర్ కావడం బుల్లితెర ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks