...
...
Next Story

Paresh Rawal: కామెడీ సినిమాలకు ఆ ఓటీటీ షో గట్టి పోటీ ఇస్తోంది.. శంకర్ దాదా ఎంబీబీఎస్ నటుడు పరేష్ రావల్ కామెంట్స్

Paresh Rawal Says Comedy Films Tough Competition Show: చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఎంతగానో నవ్వించిన నటుడు పరేష్ రావల్. ఇటీవల భూత్ బంగ్లా సినిమాతో ఆకట్టుకుంటున్న పరేష్ రావల్ తాజాగా ఓ ఓటీటీ కామెడీ షో.. కామెడీ సినిమాలకు గట్టి పోటీ ఇస్తుందని కామెంట్స్ చేశారు.

Published on: Apr 21, 2026, 12:37:11 IST
Advertisement

Paresh Rawal Says Comedy Films Tough Competition Show: బాలీవుడ్ నటుడు, కమెడియన్ పరేష్ రావల్ తెలుగులో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించారు. చిరంజీవి-పరేష్ రావల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎంతగా పేలాయో అందరికీ తెలిసిందే.

కామెడీ హారర్ మూవీ భూత్ బంగ్లా

కామెడీ సినిమాలకు ఆ ఓటీటీ షో గట్టి పోటీ ఇస్తోంది.. శంకర్ దాదా ఎంబీబీఎస్ నటుడు పరేష్ రావల్ కామెంట్స్
కామెడీ సినిమాలకు ఆ ఓటీటీ షో గట్టి పోటీ ఇస్తోంది.. శంకర్ దాదా ఎంబీబీఎస్ నటుడు పరేష్ రావల్ కామెంట్స్

ఈ సినిమానే కాకుండా చిరంజీవితో బావగారు బాగున్నారా మూవీలో కూడా పరేష్ రావల్ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే పరేష్ రావల్ నటించిన హిందీ కామెడీ హారర్ మూవీ భూత్ బంగ్లా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. డైరెక్టర్ ప్రియదర్శన్-బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటి ఈ హారర్ కామెడీ సినిమా సత్తా చాటుతోంది. ఇందులో కూడా నటుడు పరేష్ రావల్ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక

భూత్ బంగ్లా సినిమా విజయోత్సాహంలో ఉన్న ఆయన, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కామెడీ జోనర్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు పరేష్ రావల్. టెలివిజన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత కామెడీ సినిమాల స్థాయి పెరగకపోతే మనుగడ కష్టమని పరేష్ రావల్ హెచ్చరించారు.

కపిల్ శర్మ షోతో పోటీ అంత సామాన్యం కాదు

కపిల్ శర్మ షో కొన్నిసార్లు అతిగా అనిపించినా, అది సినిమాలకు ఒక బెంచ్‌మార్క్ సెట్ చేస్తోందని, ప్రతిరోజూ సినిమా మేకర్లకు సవాలు విసురుతోందని పరేష్ రావల్ అభిప్రాయపడ్డారు. అంటే నేటి తరం కామెడీ సినిమాలకు కపిల్ శర్మ ఓటీటీ షో గట్టి పోటీ ఇస్తోందని పరేష్ రావల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సునీల్ గ్రోవర్ ఒక అగ్నిపర్వతం

ఇదే క్రమంలో కమెడియన్ సునీల్ గ్రోవర్ ప్రతిభను పరేష్ రావల్ ఆకాశానికెత్తారు. సునీల్ గ్రోవర్ కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక 'టాలెంట్ వోల్కనో' (ప్రతిభగల అగ్నిపర్వతం) అని అభివర్ణించారు.

ఇటీవల సునీల్ గ్రోవర్ చేసిన రాజమౌళి, అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇమిటేషన్లు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో మనకు తెలిసిందే. ఒక మనిషి నుంచి మరో మనిషిలోకి పరకాయ ప్రవేశం చేయడంలో సునీల్ గ్రోవర్ దిట్ట అని, అలాంటి నటులతో పోటీ పడటం సినిమాలకు పెద్ద టాస్క్ అని పరేష్ రావల్ చెప్పుకొచ్చారు.

నెట్‌ఫ్లిక్స్‌లో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'

ప్రస్తుతం కపిల్ శర్మ షో తన కొత్త సీజన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అర్చన పూరన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ శాశ్వత అతిథులుగా, కృష్ణా అభిషేక్, కికు శారద వంటి హేమాహేమీలతో ఈ ఓటీటీ కామెడీ షో సందడి చేయనుంది. అటు థియేటర్లలో 'భూత్ బంగ్లా' వంటి సినిమాలు, ఇటు ఓటీటీలో కపిల్ శర్మ షో.. మొత్తానికి ప్రేక్షకులకు మాత్రం వినోదం ఫుల్ డోస్‌లో దొరుకుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks