Pradeep Rawat Son Vikramaditya Emotional: 'సై', 'గజినీ' వంటి ఎన్నో చిత్రాల్లో విలన్‌గా మెప్పించిన సీనియర్ నటుడు ప్రదీప్ రామ్ సింగ్ రావత్ (74) (Pradeep Ram Singh Rawat) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఆగస్టు 4న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ముంబైలో నిర్వహించారు.
అంత్యక్రియల్లో బాలీవుడ్ స్టార్స్

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అశుతోష్ గోవారీకర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన కుమారుడు విక్రమాదిత్య రావత్ భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు మున్నీరయ్యారు.
సాధారణ ఇన్ఫెక్షన్ అనుకుంటే.. ప్రాణాంతక క్యాన్సర్!
అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఆయన తండ్రి చివరి క్షణాలను గుర్తుచేసుకున్నారు. ప్రదీప్ రావత్ అనారోగ్యానికి గురైన మొదట్లో తామంతా సాధారణ కడుపు ఇన్ఫెక్షన్ అని భావించినట్లు విక్రమాదిత్య తెలిపారు. రెండు నెలల క్రితం వరకు ఆయన హెల్త్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని చెప్పారు.
"మొదట వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు సాధారణ స్టమక్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని మందులు ఇచ్చారు. కానీ, ఏ మందు పనిచేయలేదు. క్రమంగా నాన్న ఆరోగ్యం క్షీణించింది. బ్లడ్ టెస్ట్ చేయిస్తే వైట్ బ్లడ్ సెల్స్ (తెల్ల రక్త కణాలు) చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేలింది. వెంటనే కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించగా.. 99 శాతం బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు చెప్పారు" అని విక్రమాదిత్య వివరించారు.
"ఐసీయూ తలుపు తీసి చూస్తే.." చివరి నిమిషంలో దారుణం!
మరుసటి రోజే వైద్యులు క్యాన్సర్‌ను నిర్ధారించడంతో కుటుంబమంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చివరి క్షణాల్లో తండ్రి పడిన వేదనను వివరిస్తూ విక్రమాదిత్య తీవ్రంగా విలపించారు. నాన్నను కాపాడుకోవడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు విక్రమాదిత్య.
{{/usCountry}}మరుసటి రోజే వైద్యులు క్యాన్సర్‌ను నిర్ధారించడంతో కుటుంబమంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చివరి క్షణాల్లో తండ్రి పడిన వేదనను వివరిస్తూ విక్రమాదిత్య తీవ్రంగా విలపించారు. నాన్నను కాపాడుకోవడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు విక్రమాదిత్య.
{{/usCountry}}"ప్లేట్‌లెట్స్ కనీసం 3 లక్షలు ఉండాల్సింది పోయి ఒక్కసారిగా 3 వేలకి పడిపోయాయి. మేమంతా ఐసీయూ బయట ఆందోళనగా వేచి ఉన్నాం. ఏం జరుగుతుందో తెలియక తలుపు తీసి చూడగా.. డాక్టర్లు నాన్నకు సీపీఆర్ (CPR) ఇస్తున్నారు. అది చూశాకే అంతా అయిపోయిందని నాకు అర్థమైంది. అది చూసి అమ్మ ఏడవడం మొదలుపెట్టింది" అని విక్రమాదిత్య చెప్పారు.
అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరు
ప్రదీప్ రావత్ భార్య కళ్యాణి రావత్ అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరు అవగా, బంధువులు ఆమెను ఓదార్చారు. తండ్రి చివరి చూపు కోసం సినీ పరిశ్రమ నుంచి చాలామంది రావడంపై విక్రమాదిత్య కృతజ్ఞతలు తెలిపారు. నాన్న ఇప్పుడు ఒక ప్రశాంతమైన లోకంలో ఉన్నారని, ఇన్ని రోజులు ఆయనను అభిమానించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇండియన్ సినిమాలో చెరగని ముద్ర
కాగా, ప్రదీప్ రావత్ హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనదైన విలనిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'సర్ఫరోష్', 'లగాన్', 'నాయక్' వంటి హిందీ చిత్రాలతో పాటు తెలుగులో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' చిత్రంలో 'భిక్షు యాదవ్' పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత 'గజినీ' సినిమాలో ఆయన చేసిన పాత్ర భారతీయ సినీ చరిత్రలోనే నిలిచిపోయింది.
సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
ప్రదీప్ రావత్ హఠాన్మరణం పట్ల సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "నీతో కలిసి పనిచేసిన మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయి సోదరా.. నీ ఆత్మకు శాంతి కలగాలి" అని సంతాపాన్ని ప్రకటించారు.