Raj Arjun: నన్ను ధురంధర్‌లా కాపాడింది- కూతురిపై తెలుగు విలన్ రాజ్ అర్జున్ కన్నీళ్లు- మనసును కదిలించేలా తండ్రి మాటలు!

Raj Arjun On Sara Arjun: ధురంధర్ సినిమాతో హీరోయిన్‌గా మారిన సారా అర్జున్ ఇప్పుడు ధురంధర్ 2తో సత్తా చాటుతోంది. అలాంటి సారా అర్జున్ గురించి చెబుతూ తన తండ్రి, తెలుగు విలన్ రాజ్ అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కూతురు వల్లే తన తలరాత మారిందని, ధురంధర్‌లా కాపాడిందని చెప్పిన మాటలు కదిలించేలా ఉన్నాయి.

Published on: Mar 20, 2026, 10:10:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముంబైలో జరిగిన 'స్పోకెన్ ఫెస్ట్' వేదికపై ఒక తండ్రి ప్రేమ, పోరాటం, గెలుపు కలబోసిన అద్భుతమైన ప్రసంగం వినిపించింది. బాలీవుడ్ నటుడు, తెలుగు విలన్ రాజ్ అర్జున్ తన కుమార్తె సారా అర్జున్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకప్పుడు అవకాశాల కోసం ముంబై వీధుల్లో అలమటించిన తనకు, తన కుమార్తె ఎలా 'ధురంధర్'లా అండగా నిలిచిందో రాజ్ అర్జున్ వివరించారు.

నన్ను ధురంధర్‌లా కాపాడింది- కూతురిపై తెలుగు విలన్ రాజ్ అర్జున్ కన్నీళ్లు- మనసును కదిలించేలా తండ్రి మాటలు!
నన్ను ధురంధర్‌లా కాపాడింది- కూతురిపై తెలుగు విలన్ రాజ్ అర్జున్ కన్నీళ్లు- మనసును కదిలించేలా తండ్రి మాటలు!

జీవితాన్ని మార్చేసిన 2005..

"ముంబైకి ఎన్నో కలలతో వచ్చాను. కానీ, వరుస తిరస్కరణలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. సరిగ్గా 2005లో నా కుమార్తె సారా పుట్టింది. ఆడపిల్ల పుట్టడం అదృష్టం అని విన్నాను. అది నా విషయంలో అక్షరాలా నిజమైంది" అని రాజ్ అర్జున్ తెలిపారు.

"ఆమె (సారా అర్జున్) పుట్టిన వెంటనే నాకు మొదటిసారి లీడ్ రోల్ వచ్చింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోయినా, నాలో పట్టుదల మాత్రం తగ్గలేదు. నా జీవితంలో సారా లేకపోతే, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు" అని రాజ్ అర్జున్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

చీకటి రోజుల్లో వెలుగు రేఖ

ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన రోజులను గుర్తు చేసుకుంటూ రాజ్ అర్జున్ భావోద్వేగానికి లోనయ్యారు. "నేను విచ్ఛిన్నం కాలేను, అలాగని ఇక్కడి నుంచి పారిపోలేను. ఖాళీ జేబులతో, అద్దం ముందు నిలబడటానికి కూడా భయపడే వాడిని. కానీ నా కూతురి మెరిసే కళ్లు మాత్రం ప్రతిరోజూ 'నాన్న ధైర్యంగా ఉండు, నాకు నువ్వు కావాలి' అని చెబుతున్నట్లు ఉండేవి. తనే నా ధురంధర్ (విజేత) లాగా నన్ను పడిపోకుండా కాపాడింది" అని రాజ్ అర్జున్ పేర్కొన్నారు.

శక్తిగా మారిన సారా అర్జున్

2016లో ముఖేష్ ఛబ్రా ఆఫీస్‌కు వెళ్లినప్పుడు, సారా చిన్నపిల్లలా తన చేయి పట్టుకుని బయటకు లాక్కురావడం తన తలరాతను మార్చిందని రాజ్ అర్జున్ తెలిపారు. ఆ తర్వాతే 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలో అవకాశం రావడం, అది రూ. 900 కోట్ల వసూళ్లు సాధించడం అందరికీ తెలిసిందే.

"సాధారణంగా తండ్రి చేయి పట్టుకుని కూతురు నడుస్తుందని చెబుతారు. కానీ, నా కథలో మాత్రం నా కూతురి చేయి పట్టుకునే నేను నా గమ్యాన్ని చేరుకున్నాను. ఒకప్పుడు నేను ఆమెను చూసుకునేవాడిని, ఇప్పుడు తనే నన్ను చూసుకుంటోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా తన వెలుగును పంచుతూనే, ఆ వెలుగులో కొంత భాగాన్ని నా పేరు మీద రాస్తోంది. ఇది నాకెంతో గర్వకారణం" అని రాజ్ అర్జున్ ముగించారు.

రాజ్ అర్జున్ తెలుగు సినిమాలు

రాజ్ అర్జున్ కూతురు గురించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి మనసు కదిలించేలా ఉంది. దాంతో అవి వైరల్ అవుతున్నాయి. కాగా, రాజ్ అర్జున్ 2004లో 'బ్లాక్ ఫ్రైడే'తో కెరీర్ మొదలుపెట్టి 'రౌడీ రాథోడ్', 'రాయీస్', 'షేర్షా', 'ఆర్టికల్ 370' వంటి సినిమాలతో మంచి సక్సెస్ సాధించారు. అంతేకాకుండా 'రజాకార్', 'డియర్ కామ్రేడ్' వంటి తెలుగు చిత్రాలు, అంజలి ఝాన్సీ ఓటీటీ సిరీస్‌లో విలన్‌గా నటించి మెప్పించారు.

సారా అర్జున్ కెరీర్

ఇక సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే 'దైవ తిరుమగళ్' (తెలుగులో 'నాన్న') చిత్రంతో యావత్ భారతాన్ని మెప్పించింది. అదిత్య ధర్ దర్శకత్వంలో 'ధురంధర్' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై, బాక్సాఫీస్ వద్ద రూ. 1,300 కోట్ల రికార్డు వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ధురంధర్ 2తో తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More