టాలీవుడ్ పాపులర్ నటీనటులు రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఓటీటీ వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స్ట్రీమింగ్

తెలుగు ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జోనర్‌లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ర్ రావు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ను మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. "‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. నేను ఇప్పటి వరకు ఎన్నో రకరకాల పాత్రల్ని పోషించాను. అయితే ఈ ఓటీటీ సిరీస్‌లో చేసిన కారెక్టర్ మాత్రం మైల్‌స్టోన్‌లా నిలుస్తుంది" అని అన్నారు.
కొత్తగా చూపించారు
"ఇందులోని నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. డైరెక్టర్ కృష్ణ నన్ను చాలా కొత్తగా చూపించారు. నా స్నేహితుడు శ్రీరామ్ ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జయంత్ గారు, అనురాధా గారికి థాంక్స్" అని రాజీవ్ కనకాల తెలిపారు.
"ఫిబ్రవరి 27న మా సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఏ ఒక్కరినీ నిరాశ పరచదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఉదయభాను గారితో నేను చేసిన ప్రతీ ప్రాజెక్ట్ హిట్ అయింది. ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను" అని నటుడు రాజీవ్ కనకాల ఆశించారు.
జీ5 ఓటీటీ సంస్థలో
{{/usCountry}}"ఫిబ్రవరి 27న మా సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఏ ఒక్కరినీ నిరాశ పరచదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఉదయభాను గారితో నేను చేసిన ప్రతీ ప్రాజెక్ట్ హిట్ అయింది. ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను" అని నటుడు రాజీవ్ కనకాల ఆశించారు.
జీ5 ఓటీటీ సంస్థలో
{{/usCountry}}నిర్మాత కేవీ శ్రీరామ్ మాట్లాడుతూ .. "జీ5 ఓటీటీ సంస్థలో నాకు జయంత్, అనురాధా మేడం ఇచ్చే సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు రాజీవ్ కనకాల ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు. అయితే ఈ సిరీస్ చూసిన తరువాత నాకు ప్రసాద్ రావు మాత్రమే కనిపించారు. పాత్రలో ఎంతో ఇమిడిపోయారు" అని చెప్పారు.
"ఉదయ భాను నాకు మంచి స్నేహితురాలు. ఆమె పోషించిన కారెక్టర్ ఎంతో బాగుంటుంది. నా ప్రొడక్షన్‌లో నా ఫ్రెండ్స్‌కి మంచి పాత్రలను ఇచ్చాననే సంతృప్తి నాకు కలిగింది. ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అయ్యే ఓటీటీ సిరీస్ ఇది. ప్రతీ ఒక్క ఎపిసోడ్ క్లైమాక్స్‌లా ఉంటుంది. చివరి వరకు థ్రిల్ మెయింటైన్ చేసేలా ఉంటుంది" అని నిర్మాత కేవీ శ్రీరామ్ అన్నారు.
ఫిబ్రవరి 27న ఓటీటీ రిలీజ్
"ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన కృష్ణకి థాంక్స్. ఫిబ్రవరి 27న జీ5లో మా సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి" అని ప్రొడ్యూసర్ కేవీ శ్రీరామ్ కోరారు.