Actress Akanksha Choudhary On Casting Couch: పాపులర్ రియాలిటీ ఓటీటీ షో 'లాక్ అప్ సీజన్ 2' ముగింపు దశకు చేరుకుంది. చివరి వారంలోకి అడుగుపెట్టిన ఈ ఓటీటీ షోలో అనూహ్య మలుపులు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ప్రముఖ మోడల్, నటి ఆకాంక్ష చౌదరి షో నుంచి బయటకు వచ్చే ముందు మోడలింగ్ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ దారుణాలను బయటపెట్టి కలకలం రేపింది.
రూ.2 లక్షల కోసం వెళితే.. దారుణమైన షరతు!

అందాల పోటీల్లో (Pageants) పాల్గొనేందుకు రూ. 1-2 లక్షల ఆర్థిక సాయం కోసం ఇండస్ట్రీలో బాగా పేరున్న ఒక పెద్ద మనిషిని కలిసినట్లు ఆకాంక్ష చౌదరి తెలిపింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, తనకు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్హతలతో అతని వద్ద పనిచేసి ఆ అప్పు తీరుస్తానని చెప్పానంది.
గతంలో పోటీలకు జడ్జిగా వచ్చిన పరిచయంతోనే అతని వద్దకు వెళ్లానని, అతను ఇలా చాలా మందికి సహాయం చేశాడని తెలిసి వెళ్లానని, అయితే అతను దానికి ఒప్పుకున్నట్లే నటించి తన నివాసానికి పిలిపించుకున్నాడని ఆకాంక్ష చౌదరి తెలిపింది. గతంలో తన మెంటార్లతో కలిసి అతని ఇంటికి వెళ్లిన అనుభవంతోనే ధైర్యంగా అక్కడకు వెళ్లానని తెలిపింది.
గట్టిగా హగ్ చేసుకున్నాడు
"అయితే, అక్కడ అతను నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. కేవలం హగ్ మాత్రమే చేసుకోలేదు. నన్ను పట్టుకున్నాడు. ఎంతకీ కూడా చేతులు తీయట్లేదు. అతను చాలా పెద్దాయన. అతన్ని ఒక్కసారిగా తోసేసాను. దాంతో అతను కూర్చుని నాతో ఇలా చెప్పాడు" అని ఆకాంక్ష పేర్కొంది.
"సంవత్సరం క్రితం వచ్చినప్పుడు చాలా అమాయకంగా ఉన్నావ్. ఇప్పుడు పెరిగి పెద్దదానివయ్యావ్. అప్పుడే నాతో ఉండటానికి ఒప్పుకుని ఉంటే ఈపాటికే ప్రాజెక్టులలో నటించేదానివి. నేను ఇచ్చే డబ్బులకు ప్రతిఫలంగా నెలలో 5-6 సార్లు నాతో సెక్స్ చేయాలి" అని ఆ వ్యక్తి షరతు విధించినట్లు ఆకాంక్ష బయటపెట్టింది.
తిరస్కరించి స్వశక్తితో నిలబడిన ఆకాంక్ష
ఆ వ్యక్తి కోరికను తీవ్రంగా వ్యతిరేకించి అక్కడ నుంచి వచ్చేసినట్లు ఆకాంక్ష చెప్పింది. ఇండస్ట్రీలో వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలకు ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వకుండా అవకాశాలు రావని అతను బెదిరించినప్పటికీ, తను వెనకడుగు వేయలేదని ఆకాంక్ష పేర్కొంది.
{{/usCountry}}ఆ వ్యక్తి కోరికను తీవ్రంగా వ్యతిరేకించి అక్కడ నుంచి వచ్చేసినట్లు ఆకాంక్ష చెప్పింది. ఇండస్ట్రీలో వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలకు ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వకుండా అవకాశాలు రావని అతను బెదిరించినప్పటికీ, తను వెనకడుగు వేయలేదని ఆకాంక్ష పేర్కొంది.
{{/usCountry}}ఏ అడ్డదారులు తొక్కకుండా కేవలం తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగానని, ఆరు నెలల్లోనే ఒక పెద్ద షో సాధించి, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో వేదికపై నిలబడ్డానని గర్వంగా ప్రకటించింది ఆకాంక్ష. అయితే, ఆకాంక్ష చెప్పిన వ్యక్తి చాలా పలుకుబడి ఉన్న మనిషి అని, అందుకే అతని పేరు చెప్పట్లేదని చెప్పుకొచ్చింది.
ధైర్యాన్ని ప్రశంసించిన ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్
ఆకాంక్ష ధైర్యాన్ని చూసి షో వ్యాఖ్యాతలు ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగానికి గురయ్యారు. "ఆ వ్యక్తి ఎవరైనా సరే ఈ షో చూస్తుంటే అతనికి ఒక విషయం అర్థం కావాలి. నీచమైన ఆఫర్లను తిరస్కరించి కూడా కేవలం సొంత కష్టంతో ఇంత పెద్ద వేదికపైకి రాగలరని నువ్వు నిరూపించావ్. నీ ధైర్యాన్ని చూసి మేమంతా గర్విస్తున్నాం" అని ఫరా ఖాన్, రితేష్ కొనియాడారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో
కాగా, 'లాక్ అప్ 2' షో ప్రస్తుతం గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. శ్రేయా కల్రా, యోగేష్ రావత్, రామ్ కపూర్, శిల్పా షిండే, హర్షద్ చోప్డా, శివాంగి జోషి, వరుణ్ యాదవ్ ఫైనలిస్టులుగా రేసులో నిలిచారు. వారం చివర్లో వీరిలో ఒకరు రూ.1 కోటి నగదు బహుమతితో పాటు విజేత ట్రోఫీని గెలుచుకోనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో లాక్ అప్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.