Actress Ananya Raj Dies At Age 27: చిత్రసీమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మోడల్, టాలీవుడ్ నటి, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య రాజ్ (27) చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లారు. హిందీతో పాటు ప్రాంతీయ భాషా చిత్రాల్లో, మ్యూజిక్ వీడియోలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
నిద్రలోనే కన్నుమూసిన అనన్య రాజ్

గత కొద్దిరోజులుగా అనన్య రాజ్ వార్తల్లో కనిపించకపోవడంతో అభిమానులు ఆందోళన చెందగా, జులై 15వ తేదీ అర్థరాత్రి నిద్రలోనే అనన్య రాజ్ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తాజాగా ప్రకటించారు.
ఏడాదిగా మానసిక, శారీరక క్షోభ.. ఏమైందంటే?
అనన్య రాజ్ ఆకస్మిక మరణానికి గల కచ్చితమైన కారణాలను కుటుంబ సభ్యులు బయటకు చెప్పనప్పటికీ, గత ఏడాది కాలంగా ఆమె తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలతో బాధపడినట్లు తెలిపారు. ఎంతటి కష్టమొచ్చినా ఒక యోధురాలిలా పోరాడిందని, అయితే జులై 15న అర్థరాత్రి నిద్రలోనే ప్రశాంతంగా ప్రాణాలు వదిలిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అనన్య రాజ్ అంత్రక్రియల ఫొటోలు
హీరోయిన్ అనన్య రాజ్ అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ, ఈ కష్టసమయంలో తమ వ్యక్తిగత జీవితానికి (ప్రైవసీ) ప్రాధాన్యం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.
"వెలిగిపోయే సమయం వచ్చింది": చివరి పోస్ట్ వైరల్
అనన్య రాజ్ మే 17న పెట్టిన చివరి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక షూటింగ్ సెట్‌లో బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో అందంగా పోజ్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ.. "బ్లాక్ అండ్ వైట్.. ఇక నేను వెలిగిపోయే సమయం వచ్చింది (It's time to shine)" అని అనన్య రాజ్ క్యాప్షన్ రాసుకొచ్చారు.
శాశ్వతంగా నూరేళ్లు నిండిపోతాయని
అయితే అదే ఆమె చివరి పోస్ట్ అవుతుందని, అంతలోనే శాశ్వతంగా నూరేళ్లు నిండిపోతాయని ఎవరూ ఊహించలేదు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అనన్య ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
అనన్య రాజ్ బాలీవుడ్ సినిమాలు, ఫాలోవర్లు
{{/usCountry}}అయితే అదే ఆమె చివరి పోస్ట్ అవుతుందని, అంతలోనే శాశ్వతంగా నూరేళ్లు నిండిపోతాయని ఎవరూ ఊహించలేదు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అనన్య ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
అనన్య రాజ్ బాలీవుడ్ సినిమాలు, ఫాలోవర్లు
{{/usCountry}}అనన్య రాజ్‌కు సోషల్ మీడియాలో 1.5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 2016లో వచ్చిన '7 అవర్స్ టు గో' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనన్య రాజ్ ఆ తర్వాత 'ది ఫైనల్ ఎగ్జిట్' (2017), విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన 'గోస్ట్' (2019) సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.
'తగ్గెదే లే' సినిమాతో తెలుగులో గుర్తింపు
టి-సిరీస్, జీ మ్యూజిక్, టైమ్స్ మ్యూజిక్ వంటి దిగ్గజ సంస్థల మ్యూజిక్ వీడియోల్లోనూ అనన్య మెరిసారు. తెలుగులో నవీన్ చంద్ర హీరోగా వచ్చిన 'తగ్గేదే లే' చిత్రంతో పాటు 'మద్రాసి గ్యాంగ్' అనే త్రిభాషా చిత్రంలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనన్య రాజ్.
చిన్న వయసులోనే మంచి భవిష్యత్తు ఉన్న నటి అనన్య రాజ్ ఇలా దూరమవ్వడం పట్ల సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.