Ayesha Khan Arrest In Mumbai: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. 'ధురంధర్' చిత్రంలో 'షరారత్' అనే స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ముంబైలో జరుగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
దాదర్ వీధుల్లో ఏం జరిగింది?

దాదర్ ప్రాంతంలో రోడ్డుపై ఊరికే నిలబడిన తమను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారని ఆయేషా ఖాన్ ఆరోపించారు. బుధవారం (జూలై 22) సాయంత్రం 4 గంటల సమయంలో దాదర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసన సంఘీభావ సభకు ఆయేషా ఖాన్ తన సోదరుడు, స్నేహితులతో కలిసి వెళ్లారు.
అక్కడ తాము ఎలాంటి నినాదాలు చేయకముందే, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు చుట్టుముట్టారని ఆయేషా తెలిపారు. మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని అడుగుతున్న సమయంలోనే, దాదాపు 15 మంది పోలీసుల బృందం (10 మంది పురుషులు, 5 గురు మహిళా పోలీసులు) వచ్చి తమపై బలప్రయోగం చేశారని వివరించారు.
అరెస్ట్‌పై లేని సమాధానం
మహిళా పోలీసులు తనను బలవంతంగా లాక్కెళ్లారని, తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వినకుండా పోలీస్ వ్యాన్‌లోకి నెట్టేశారని ఆయేషా వెల్లడించారు.
"నన్ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పమని వ్యాన్ అంతటా అధికారులను వేడుకున్నా ఏ ఒక్కరి నుంచి సమాధానం రాలేదు" అని ఆయేషా ఆవేదన వ్యక్తం చేశారు.
దాదర్ నుంచి తమను వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అక్కడ అధికారులు పద్ధతిగానే మాట్లాడినప్పటికీ.. అసలు తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదని ఆయేషా ఖాన్ పేర్కొన్నారు.
"రోడ్డుపై నిలబడటం నేరమా?" - ఆయేషా తీవ్ర ఆగ్రహం
పోలీసులు తనను నెట్టివేస్తూ వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న వీడియోను ఆయేషా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సింది పోయి, ప్రశాంతంగా ఉన్న పౌరులపైనే అధికారులు ప్రతాపం చూపుతున్నారని ఆయేషా ఖాన్ మండిపడ్డారు.
{{/usCountry}}పోలీసులు తనను నెట్టివేస్తూ వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న వీడియోను ఆయేషా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సింది పోయి, ప్రశాంతంగా ఉన్న పౌరులపైనే అధికారులు ప్రతాపం చూపుతున్నారని ఆయేషా ఖాన్ మండిపడ్డారు.
{{/usCountry}}"రోడ్డుపై ప్రశాంతంగా నిలబడటం ఎప్పటి నుంచి నేరమైంది?" అని ఆయేషా ప్రశ్నించారు. సమాజంలో జవాబుదారీతనం లోపించిందని, ఏ తప్పూ చేయనందున ఈ రోజు తనకు ఎంతో ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా మిన్నంటిన విద్యార్థుల ఆందోళనలు
కాగా మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు ఇప్పుడు దేశంలోని పలు ప్రధాన నగరాలకు వ్యాపించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఈ నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.
సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ముంబైలోని శివాజీ పార్క్, చైత్యభూమి, దాదర్ తదితర ప్రాంతాల్లోనూ విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు చర్యగా పలువురిని అదుపులోకి తీసుకోగా, అందులో తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్ కూడా ఉన్నారు.
ఆయేషా ఖాన్ తెలుగు సినిమాలు
శ్రీ విష్ణు ఓం భీమ్ భుష్, విశ్వక్ సేన్ ముఖచిత్రం, శర్వానంద్ మనమే వంటి తెలుగు సినిమాల్లో నటించింది ఆయేషా ఖాన్. అన్నిటికి మించి ధురంధర్‌లో స్పెషల్ సాంగ్‌తో ఇండియా వైడ్ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఆయేషా ఖాన్.