...
...
Next Story

CM Vijay: నా కడుపులో బిడ్డను కోల్పోడానికి సీఎం విజయ్‌నే కారణం- నటి జూలి సంచలన ఆరోపణలు- 15 లక్షల కిడ్నీ స్కామ్ మోపారంటూ!

Actress Julie Allegations On CM Vijay Over Miscarriage: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై నటి జూలి సంచలన ఆరోపణలు చేశారు. తాను కడుపులో బిడ్డను కోల్పోడానికి దళపతి విజయ్‌నే కారణమంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా తనపై 15 లక్షల కిడ్నీ స్కామ్ మోపారంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Published on: Jun 1, 2026, 14:06:37 IST
Advertisement

Actress Julie Allegations On CM Vijay Over Miscarriage: తమిళనాడులో ప్రసిద్ధ జల్లికట్టు ఉద్యమం (2017) ద్వారా వెలుగులోకి వచ్చి, ఆ తర్వాత 'బిగ్ బాస్' తమిళ షోతో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన నటి, మాజీ నర్స్ జూలి (మేరీ జూలియానా) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నా కడుపులో బిడ్డను కోల్పోడానికి సీఎం విజయ్‌నే కారణం- నటి జూలి సంచలన ఆరోపణలు- 15 లక్షల కిడ్నీ స్కామ్ మోపారంటూ!
నా కడుపులో బిడ్డను కోల్పోడానికి సీఎం విజయ్‌నే కారణం- నటి జూలి సంచలన ఆరోపణలు- 15 లక్షల కిడ్నీ స్కామ్ మోపారంటూ!

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్ కారణంగా తన గర్భంలో పెరుగుతున్న తొలి బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దారుణానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ కార్యకర్తలు, అభిమానులే కారణమంటూ ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మానసిక క్షోభే నా బిడ్డను బలితీసుకుంది

ఈ ఏడాది జనవరిలో మహ్మద్ ఇక్రీమ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న జూలి, ఇటీవల గర్భం దాల్చారు. అయితే సోషల్ మీడియాలో కొందరు కావాలనే తనను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, దాంతో తీవ్ర మానసిక క్షోభకు గురై గర్భస్రావం (Miscarriage) అయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు.

"సోషల్ మీడియాలో నాపైన, నా భర్తపైన దారుణమైన అపవాదులు సృష్టించారు. ఒక మహిళ టీవీకే పార్టీ విధానాలపై మాట్లాడితే చాలు.. విచక్షణ లేకుండా ఆమె క్యారెక్టర్‌ను నాశనం చేస్తారా? వాళ్లు పక్కాగా కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ రాసుకుని నాపై దుష్ప్రచారం చేశారు. ఆ వేదన భరించలేకే నా కడుపులోని బిడ్డ చనిపోయింది" అని జూలి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై రూ. 15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు కూడా మోపారని ఆమె పేర్కొన్నారు.

సీఎం విజయ్‌పై జూలి నేరుగా ధ్వజం

"నా బిడ్డను కోల్పోవడానికి కారణం విజయ్ అన్నయే. అయితే ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా నా గర్భస్రావానికి విజయ్ అన్నయే బాధ్యుడు. తన అభిమానులను, కార్యకర్తలను వెనక్కి తగ్గమని ఆయన ఒక్క మాట చెప్పి ఉంటే ఈరోజు నా బిడ్డ బతికే ఉండేది" అని జూలి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గత మార్చిలోనే తాను ఈ ట్రోలింగ్‌పై అప్పటి ప్రభుత్వ హయాంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా, అధికారులు దానిని సివిల్ డిఫమేషన్ కింద కొట్టేసి సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందారు.

జూలి వ్యాఖ్యలపై నటి అంబిక ఫైర్

ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి జూలి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జూలి పట్ల సానుభూతి వ్యక్తమవుతున్నప్పటికీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయడం సరికాదంటూ దక్షిణాది సీనియర్ నటి అంబిక సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా స్పందించారు.

"జూలికి గర్భస్రావం జరగడం నిజంగా బాధాకరం. కానీ, ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావు, నైతికత లేనివి. నీ వ్యక్తిగత ఆరోగ్య సమస్యకు మన ముఖ్యమంత్రి ఎలా కారణమవుతారో చెప్పాలి? అత్యున్నత పదవిలో ఉన్న సీఎం లేదా పీఎం వయసు ఎంత అన్నది ముఖ్యం కాదు.. ఆ స్థానానికి ఇచ్చే గౌరవం చాలా ముఖ్యం. జూలి చాలా అసభ్యకరమైన భాష వాడుతూ అగౌరవంగా మాట్లాడారు" అని అంబిక మండిపడ్డారు.

జూలికి విజయ్ అంటే పడదని టాక్

మరోవైపు విజయ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో జూలిని నిలదీస్తూ.. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే, జల్లికట్టు వివాదంతో వైరల్ అయిన నటి జూలీకి దళపతి విజయ్ అంటే పడదని సమాచారం.

అందుకే ఇటీవలీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ్‌కి వ్యతిరేకంగా, విమర్శిస్తూ ప్రచారం చేసింది జూలీ. విజయ్‌కి వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్‌లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిరసన తెలిపి వివాదంలో కూడా చిక్కుకుంది నటి జూలి. ఇలా విమర్శలు గుప్పించిన క్రమంలో తనపై ట్రోలింగ్ మొదలుపెట్టారు దళపతి అభిమానులు, టీవీకే కార్యకర్తలు.

తీవ్ర దుమారం

ఆ ట్రోలింగ్‌లో తనను, తన భర్తను అనరాని మాటలు అన్నారని, దానివల్ల నరకయాతన అనుభవించానని, దానివల్ల కడుపులో బిడ్డను కోల్పోయానని, దానికి కారణం పరోక్షంగా హీరో, దళపతి విజయ్ అని ఇప్పుడు నటి జూలి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నటి జూలి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు?

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్, క్యారెక్టర్ అస్సాసినేషన్ (వ్యక్తిత్వ హననం) పై చర్యలు తీసుకోవాలని నటి జూలి చెన్నై పోలీసులను ఆశ్రయించారు.

2. గర్భస్రావానికి జూలి ఎవరిని బాధ్యులను చేశారు?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ మద్దతుదారులు, అభిమానులు చేసిన ఆన్‌లైన్ వేధింపుల వల్లే తాను తీవ్ర మానసిక క్షోభకు గురై గర్భస్రావం అయిందని జూలి ఆరోపించారు.

3. జూలి వ్యాఖ్యలపై సీనియర్ నటి అంబిక ఎలా స్పందించారు?

జూలికి గర్భస్రావం జరగడం బాధాకరమే అయినప్పటికీ, ఒక ఆరోగ్య సమస్యకు రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేస్తూ అసభ్యకర పదజాలంతో మాట్లాడటం ఏమాత్రం సరికాదని నటి అంబిక తీవ్రంగా తప్పుబట్టారు.

4. జూలి ఎప్పుడు వివాహం చేసుకున్నారు? ఆమెకు ఎక్కడ గుర్తింపు వచ్చింది?

జూలి ఈ ఏడాది (2026) జనవరిలో మహ్మద్ ఇక్రీమ్‌ను వివాహం చేసుకున్నారు. 2017లో తమిళనాడులో జరిగిన ప్రసిద్ధ 'జల్లికట్టు' ఉద్యమం ద్వారా, ఆ తర్వాత 'బిగ్ బాస్ తమిళ' షో ద్వారా ఆమె గుర్తింపు పొందారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe