నిర్మాతలు దర్శకులుగా మారడం, డైరెక్టర్స్ నటులు అవడం, హీరోలు డైరెక్షన్ చేయడం, హీరోయిన్స్ పాటలు పాడటం వంటి ఇంట్రెస్టింగ్ సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఓసారి జరుగుతూనే ఉంటాయి. అలాగే, మెయిన్ లీడ్ రోల్ చేయడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించిన హీరోలు కూడా ఉన్నారు.
డైరెక్టర్‌గా, నిర్మాతగా మారి

ఈ కోవకే చెందుతుంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీజ. అయితే, ఈమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది సినిమా కాదు. ఓ సాంగ్. అదే కొత్త కొత్తగా. బ్యూటిపుల్ హీరోయిన్ శ్రీజ డైరెక్టర్‌గా, నిర్మాతగా మారి రూపొందించిన పాటే కొత్త కొత్తగా. ఈ సాంగ్ ఆల్బమ్‌లో శ్రీజకు జోడీగా దేవగుడి సినిమా హీరో అభినవ్ శౌర్య యాక్ట్ చేశాడు.
సాంగ్ లాంచ్ ఈవెంట్
కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్‌కు రఘురాం సంగీతం, సాహిత్యం అందించగా.. సింగర్ లిప్సిక ఆలపించారు. అయితే, ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ రిలీజ్ చేస్తూ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ శ్రీజ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
హీరోగా జన్మనిచ్చారు
హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ.. "దేవగుడి చిత్రంతో నాకు హీరోగా జన్మనిచ్చారు బెల్లం రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ కూడా ఆయన సపోర్ట్‌తోనే చేయగలిగాను. శ్రీజతో కలిసి ఈ సాంగ్ చేయడం హ్యాపీగా ఉంది. ఆమెకు పట్టుదల ఎక్కువ. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా చాలా క్లారిటీగా ఉంటుంది. తను అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు ప్రయత్నిస్తుంది" అని తెలిపాడు.
నేనే కొరియోగ్రఫీ చేశాను
"ఈ పాటకు స్టెప్స్ నేనే కొరియోగ్రఫీ చేశాను. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. హీరోగా స్క్రిప్ట్స్ వింటున్నా. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నా" అని తన అప్‌కమింగ్ సినిమాల గురించి చెప్పాడు హీరో అభినవ్ శౌర్య.
సమంత ఫ్రెండ్ క్యారెక్టర్
{{/usCountry}}"ఈ పాటకు స్టెప్స్ నేనే కొరియోగ్రఫీ చేశాను. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. హీరోగా స్క్రిప్ట్స్ వింటున్నా. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నా" అని తన అప్‌కమింగ్ సినిమాల గురించి చెప్పాడు హీరో అభినవ్ శౌర్య.
సమంత ఫ్రెండ్ క్యారెక్టర్
{{/usCountry}}హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీజ మాట్లాడుతూ.. "మా కొత్త కొత్తగా సాంగ్‌ను లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ డీవై చౌదరి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వారి ప్రొడక్షన్‌లో నేను సీరియల్స్‌లో నటించాను. నాకు నటన అంటే ప్యాషన్. రంగస్థలం సినిమాలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత మరికొన్ని మూవీస్‌లోనూ నటించాను" అని చెప్పారు.
టీవీ ఛానెల్స్ కోసం
"టీవీ ఛానెల్స్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, జూ లకటక షోస్ చేశాను. శ్రీజ మ్యూజిక్ ఛానెల్‌లో మేము చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ చేశాం. ఈ పాటను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశాం. బడ్జెట్ ఎంత అయింది అనేది చూసుకోలేదు. ఈ సాంగ్‌లో కొంత షూట్ మా ఇంట్లోనే చేశాం. కొత్త కొత్తగా సాంగ్‌ను మీరంతా విని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించారు శ్రీజ.
శ్రీజకు శుభాకాంక్షలు
కాగా, బీఆర్ఎస్ మహిళా వింగ్ మణికొండ ప్రెసిడెంట్ పటోళ్ల రూప రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త కొత్తగా ఆల్బమ్ మంచి విజయం సాధించాలని తన బెస్ట్ విషెస్ అందించారు. అలాగే, ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీజ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.