...
...
Next Story

Adivi Sesh: 4 ఆస్కార్స్, 16 నామినేషన్స్- ఓటీటీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ నచ్చలేదన్న అడివి శేష్- ఎక్కడ చూడాలంటే?

Adivi Sesh On Oscar Award Winning Movie: 16 ఆస్కార్ నామినేషన్స్, నాలుగు అవార్డులు పొందిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సిన్నర్స్ తనకు నచ్చలేదని టాలీవుడ్ హీరో అడివి శేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మరి అడివి శేష్‌కు నచ్చకపోడానికి కారణాలు, సిన్నర్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.

Published on: Apr 4, 2026, 14:32:49 IST
Advertisement

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, రైటర్ అడివి శేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అంతర్జాతీయ సినిమాలు, ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల గురించి చర్చిస్తున్న సమయంలో.. హాలీవుడ్ దర్శకుడు ర్యాన్ కూగ్లర్ తెరకెక్కించిన 'సిన్నర్స్' చిత్రం తనకు నచ్చలేదని అడివి శేష్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

4 ఆస్కార్స్, 16 నామినేషన్స్- ఓటీటీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ నచ్చలేదన్న అడివి శేష్- ఎక్కడ చూడాలంటే?
4 ఆస్కార్స్, 16 నామినేషన్స్- ఓటీటీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ నచ్చలేదన్న అడివి శేష్- ఎక్కడ చూడాలంటే?

నిజానికి 'సిన్నర్స్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్లు దక్కించుకుని, నాలుగు అకాడమీ అవార్డ్స్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అలాంటి సినిమాపై అడవి శేష్ నెగిటివ్ కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎందుకు నచ్చలేదు? శేష్ వెర్షన్ ఇదే..

ర్యాన్ కూగ్లర్ తీసిన 'బ్లాక్ పాంథర్ 1', 'లవ్ సిన్నర్స్' వంటి చిత్రాలు ఒక గొప్ప ప్రయోగానికి దక్కిన గుర్తింపులా కాకుండా, ఒక కొత్త ప్రయోగానికి ఇచ్చిన గౌరవంలా తనకు అనిపించాయని అడివి శేష్ అభిప్రాయపడ్డారు.

"సిన్నర్స్ సినిమా విషయంలో వారు ఏం చూపించాలనుకున్నారో నాకు సరిగ్గా అర్థం కాలేదు. అది ఒక వాంపైర్ సినిమానా? లేక జాత్యహంకారం (Racism)పై చేసిన వ్యాఖ్యనా? లేక బ్లాక్ మిస్టిసిజం గురించి చెబుతున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. ఒక ప్రేక్షకుడిగా ఆ సినిమా నాకు కనెక్ట్ కాలేదు" అని అడివి శేష్ వివరించారు.

అయితే అదే దర్శకుడు తీసిన 'క్రీడ్ 1', 'ఫ్రూట్‌వేల్ స్టేషన్' చిత్రాలు మాత్రం తన ఆల్-టైమ్ ఫేవరెట్ అని, అవి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అడివి శేష్ పేర్కొనడం విశేషం.

నెట్టింట భిన్నాభిప్రాయాలు

సాధారణంగా సోషల్ మీడియాలో ఎవరైనా ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, వెంటనే వారిని టార్గెట్ చేయడం లేదా వర్గాలుగా విడిపోయి వాదించుకోవడం ఈ మధ్య ఎక్కువైపోయింది. అడివి శేష్ ఎక్కడా సినిమాను కించపరచకుండా, తనకు ఎందుకు నచ్చలేదనే విషయాన్ని లాజికల్‌గా వివరించారు. ఈ చర్చ ఆరోగ్యకరమైన సినిమా విశ్లేషణగా సాగితే మంచిదే కానీ, అది వ్యక్తిగత దాడులకు దారితీయకూడదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సిన్నర్స్ ఓటీటీ స్ట్రీమింగ్

కాగా ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్స్ పొంది, నాలుగు ఆస్కార్స్ సొంతం చేసుకున్న హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సిన్నర్స్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. జియో హాట్‌స్టార్‌లో సిన్నర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే, అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేసిన డెకాయిట్ హిందీ ట్రైలర్‌ను తాజాగా ఇవాళ (ఏప్రిల్ 4) విడుదల చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks