టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’. తాజాగా ఏప్రిల్ 4న డెకాయిట్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా కథ చెప్పకుండా ఇంటెన్స్ సీన్స్‌తో డెకాయిట్ ట్రైలర్ అదిరిపోయింది. అయితే, మార్చి 19న ఉగాది కానుకగా డెకాయిట్ సినిమా విడుదల కావాల్సింది.

కానీ, అదే సమయంలో బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ కూడా రిలీజ్ కావడంతో డెకాయిట్ మూవీ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు మేకర్స్. దీంతో వచ్చే వారం 'డెకాయిట్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 10న డెకాయిట్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ వాయిదాపై అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'ధురంధర్ 2' ఒక ప్రభంజనం!
డెకాయిట్ విడుదల తేదీ మార్పు గురించి అడివి శేష్ మాట్లాడుతూ.. "మేము తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకుని మార్చి 19న రావాలనుకున్నాం. కానీ, నా మిత్రుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఒక ప్రభంజనం సృష్టించింది. ధురంధర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా హవా వల్ల మా చిత్రానికి సరైన థియేటర్లు దొరకడం కష్టమనిపించింది. అందుకే వెనక్కి తగ్గాం" అని నిజాయితీగా అంగీకరించారు.
ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంపై స్పందిస్తూ.. "ఈ సినిమా (ధురంధర్ 2) మరో మూడు నాలుగు నెలల పాటు థియేటర్లలో ఆడుతుందని నా నమ్మకం. ఇది ఐపీఎల్ లాంటిది.. ఒక సంస్కృతినే ప్రభావితం చేసే గొప్ప విషయం. అయితే, థియేటర్లలో అన్ని రకాల సినిమాలకు చోటు ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ధురంధర్ 2 టికెట్లు దొరకకపోతే, హ్యాపీగా మా 'డెకాయిట్' చూడొచ్చు" అంటూ చమత్కరించారు అడివి శేష్.
యాక్షన్ లవ్ డ్రామాగా ‘డెకాయిట్’
షానీల్ డియో దర్శకత్వంలో వస్తున్న డెకాయిట్ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు కొన్ని అనివార్య కారణాల వల్ల కలిసి దొంగతనాలు చేయాల్సి రావడం, ఆ ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చింది అనేదే ఈ చిత్ర కథ. ఇందులో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అజేయంగా ‘ధురంధర్ 2’
{{/usCountry}}షానీల్ డియో దర్శకత్వంలో వస్తున్న డెకాయిట్ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు కొన్ని అనివార్య కారణాల వల్ల కలిసి దొంగతనాలు చేయాల్సి రావడం, ఆ ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చింది అనేదే ఈ చిత్ర కథ. ఇందులో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అజేయంగా ‘ధురంధర్ 2’
{{/usCountry}}మరోవైపు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మూడో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని పట్టు సాధించింది. పాకిస్థాన్‌లోని ల్యారీ గ్యాంగ్‌లను అంతం చేసే భారతీయ గూఢచారి హమ్జా (జస్కీరాత్ సింగ్ రంగీ) కథతో తెరకెక్కిన ఈ చిత్రం, అటు యాక్షన్ ప్రియులను, ఇటు సాధారణ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ నటన ధురంధర్ 2కి ప్లస్ పాయింట్.