...
...
Next Story

Alia Bhatt Eternal Kids: చిన్నారుల కోసం కొత్త బ్రాండ్ ప్రారంభించిన అలియా భట్- తన తాతయ్య చెప్పిన కథలతో ఎటర్నల్ కిడ్స్!

Alia Bhatt Started Eternal Kids Brand On Her Birthday: తన 33వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అలియా భట్ తీపి కబురు అందించారు. తన తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ రాసిన కథల ఆధారంగా ‘ఎటర్నల్ కిడ్స్’ అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చిన్నారులకు కొత్త కథలు అందనున్నాయి.

Published on: Mar 16, 2026, 17:03:00 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ తన 33వ పుట్టినరోజును అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన నిర్మాణ సంస్థ 'ఎటర్నల్ సన్‌షైన్' (Eternal Sunshine) చిన్నారుల వినోద రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. 'ఎటర్నల్ కిడ్స్' (Eternal Kids) పేరుతో ప్రారంభించిన ఈ కొత్త విభాగం ద్వారా పిల్లల కోసం అద్భుతమైన కథలను తీసుకురాబోతున్నారు.

చిన్నారుల కోసం కొత్త బ్రాండ్ ప్రారంభించిన అలియా భట్- తన తాతయ్య చెప్పిన కథలతో ఎటర్నల్ కిడ్స్!
చిన్నారుల కోసం కొత్త బ్రాండ్ ప్రారంభించిన అలియా భట్- తన తాతయ్య చెప్పిన కథలతో ఎటర్నల్ కిడ్స్!

తాతయ్యకు ప్రేమతో..

ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఎమోషనల్ జర్నీ ఉంది. 2023 జూన్‌లో కన్నుమూసిన తన తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ సృష్టించిన పాత్రలు, ఆయన రాసిన కథలే ఈ ‘ఎటర్నల్ కిడ్స్’కు పునాది అని అలియా భట్ వెల్లడించారు. తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి చిన్నప్పుడు తాతయ్య దగ్గర విన్న కథలను ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్లు అలియా భట్ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

3 ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్

"మా నిర్మాణ సంస్థలోకి కొత్త అతిథి వచ్చింది.. అదే ఎటర్నల్ కిడ్స్. ప్రస్తుతం మూడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. వాటికి ప్రస్తుతానికి సి(C), జి(G), ఎం(M) అని కోడ్ నేమ్స్ పెట్టాం. తాతయ్య సృష్టించిన కథల ఆధారంగా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. తాతయ్య మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం" అని అలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

అలియా కొత్త ప్రయాణం..

కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగానూ అలియా తన ముద్ర వేస్తున్నారు. చిన్నారుల కోసం క్లాసిక్ కథలను కొత్త తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేయనుంది. మరోవైపు, తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి 'డోంట్ బీ షై' (Don't Be Shy) అనే సినిమాను కూడా అలియా భట్ నిర్మిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

సినిమాల విషయానికొస్తే..

ఇక నిర్మాతగా బిజీగా ఉన్నప్పటికీ అలియా భట్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) నుంచి వస్తున్న 'ఆల్ఫా' (Alpha) జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో అలియా భట్‌తోపాటు శార్వరీ వాఘ్, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe