Alia Bhatt Scarred Incident Reveals Bodyguard: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ అలియా భట్. అయితే సెలబ్రిటీ హోదా పెరిగే కొద్దీ వారికి భద్రత అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో చెప్పడానికి ఒక పాత ఉదంతమే సాక్ష్యం.

అలియా అరంగేట్రం చేసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' (2012) షూటింగ్ సమయంలో విదేశీ ప్రయాణంలో భాగంగా అలియా భట్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది. అప్పట్లో ఆమెకు బాడీగార్డ్‌గా పనిచేసిన జీషన్ ఖురేషి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనాటి వివరాలను పంచుకున్నారు.
ఒంటరిగా దొరికితే చుట్టుముట్టేశారు!
అలియా భట్ తన తొలి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్న సమయం అది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని అలియా ఒక మూలన నిలబడి ఉండగా, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. అప్పట్లో ఆమెతో పాటు మేనేజర్ కానీ, బాడీగార్డ్ కానీ పక్కన లేరు. జీషన్ ఖురేషి ఇంకా ఇమ్మిగ్రేషన్ క్యూలోనే ఉండటంతో అలియా ఒంటరిగా దొరికిపోయింది.
"కస్టమ్స్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ టీమ్ ఆమెను చూడగానే ఎగ్జైట్ అయ్యారు. ఆలియా ఒంటరిగా ఉండటంతో ఒక్కసారిగా మీద పడ్డారు. 'మేడం.. ఒక్క ఫోటో' అంటూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు" అని జీషన్ నాటి పరిస్థితులను వివరించారు.
భయంతో వణికిపోయిన హీరోయిన్
ఒక్క నిమిషం వ్యవధిలోనే పరిస్థితి చేయి దాటిపోయింది. చుట్టూ జనం గుమిగూడటంతో అలియా భట్ భయంతో వణికిపోయింది. "పాపం ఆ పిల్ల (అలియా భట్) తన చేతులు, కాళ్లు దగ్గరకు ముడుచుకుని బిక్కుబిక్కుమంటూ నిలబడింది. వారంతా చదువుకున్న వారే కానీ.. ఆమె మీద పడిపోతున్నంతగా ప్రవర్తించారు. కొందరైతే ఆమె మెడపై, భుజాలపై చేతులు వేయడానికి ప్రయత్నించారు" అని జీషన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఇమ్మిగ్రేషన్ పూర్తి కాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని గద్దించి, అలియాను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు జీషన్ పేర్కొన్నారు. స్క్రీన్ మీద హీరోయిన్ అయినా, బయట ఒక అమ్మాయి అన్న కనీస గౌరవం లేకుండా ప్రవర్తించిన అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు.
అలియా చేతిలో భారీ ప్రాజెక్టులు
{{/usCountry}}తన ఇమ్మిగ్రేషన్ పూర్తి కాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని గద్దించి, అలియాను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు జీషన్ పేర్కొన్నారు. స్క్రీన్ మీద హీరోయిన్ అయినా, బయట ఒక అమ్మాయి అన్న కనీస గౌరవం లేకుండా ప్రవర్తించిన అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు.
అలియా చేతిలో భారీ ప్రాజెక్టులు
{{/usCountry}}ప్రస్తుతం ఈ జీషన్ ఖురేషి.. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ దంపతులకు బాడీగార్డ్‌గా పనిచేస్తున్నారు. ఇక అలియా భట్ తన కెరీర్‌లో అత్యున్నత దశలో ఉంది. ఆమె చేతిలో ప్రతిష్టాత్మకమైన 'వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్' చిత్రం 'ఆల్ఫా' ఉంది. శివ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శార్వరీ వాగ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జూలై 10న అల్ఫా చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. అంతేకాకుండా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' అనే భారీ చిత్రంలోనూ అలియా భట్ నటిస్తోంది. ఇందులో తన భర్త రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
భారీ అంచనాలు
వివాహం తర్వాత రణ్‌బీర్-అలియా కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల కానుంది.