...
...
Next Story

Alia Bhatt Gareeb: విద్యార్థిని పేదవాడు అన్న అలియా భట్- కమెడియన్ డైలాగ్‌తో కౌంటర్- కేకలు, ఈలలతో కాలేజ్ కాంపౌండ్!

Alia Bhatt Counter To Student Says Gareeb Aadmi Alpha: 'ఆల్ఫా' ప్రమోషన్స్‌లో భాగంగా రాజస్థాన్‌లోని ఓ యూనివర్సిటీకి వెళ్లిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. కమెడియన్ పాపులర్ డైలాగ్‌ను వాడుతూ అలియా ఓ విద్యార్థి నోరు నొక్కేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Published on: Jul 2, 2026, 14:07:55 IST
Advertisement

Alia Bhatt Counter To Student Says Gareeb Aadmi Alpha: బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ సమయస్ఫూర్తికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. తను నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) ప్రమోషన్స్ కోసం రాజస్థాన్ వెళ్లిన అలియా, అక్కడ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నవ్వులతో నిండిపోయిన స్టేజ్

విద్యార్థిని పేదవాడు అన్న అలియా భట్- కమెడియన్ డైలాగ్‌తో కౌంటర్- కేకలు, ఈలలతో కాలేజ్ కాంపౌండ్!
విద్యార్థిని పేదవాడు అన్న అలియా భట్- కమెడియన్ డైలాగ్‌తో కౌంటర్- కేకలు, ఈలలతో కాలేజ్ కాంపౌండ్!

ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా క్రేజీ స్టైల్‌ను ఫాలో అవుతూ అలియా ఇచ్చిన కౌంటర్‌తో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. రాజస్థాన్‌లోని జేఈసీఆర్‌సీ (JECRC) ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులతో అలియా భట్ ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఓ స్టూడెంట్ ఆలియాను మైక్‌లో ఒక ప్రశ్న అడిగారు. "సోషల్ మీడియాలో ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నడిచే 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోకి వెళ్లడానికి మీ మేనేజ్‌మెంట్, మీరు ఎలా ఒప్పుకున్నారు?" అని ప్రశ్నించాడు.

డబ్బు కామెంట్

అలియా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే.. ఆడియన్స్‌లో కూర్చున్న మరో స్టూడెంట్ గట్టిగా "పైసా (డబ్బు)!" అంటూ అరిచాడు. కేవలం భారీ రెమ్యునరేషన్ కోసమే అలియా ఆ ఓటీటీ షోకి వెళ్లారనే అర్థంలో అతను ఆ కామెంట్ చేశాడు.

సమయ్ రైనా డైలాగ్‌తో అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్

ఆ కామెంట్ వినగానే అలియా భట్ అస్సలు కంగారు పడలేదు. మొదట నవ్వేసిన ఆమె, వెంటనే మైక్ అందుకుని గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇంతకీ ఆ మాట అన్నది ఎవరు? బహుశా ఎవరో ఒక పేదవాడు (గరీబ్ ఆద్మీ) అనుకుంటా" అని అలియా నవ్వుతూ ఎద్దేవా చేశారు. ఈ పంచ్ డైలాగ్ వినగానే అక్కడున్న స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా ఈలలు, కేకలతో కాలేజీ కాంపౌండ్‌ను హోరెత్తించారు.

ఈ డైలాగ్ వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 'ఇండియాస్ గాట్ లేటెంట్' సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌లో అలియా భట్, ఆమె కో-స్టార్ శార్వరి వాఘ్ ఇద్దరూ గెస్టులుగా హాజరయ్యారు. ఆ షోలో కమెడియన్ సమయ్ రైనా ఒక కంటెస్టెంట్‌ను ఉద్దేశిస్తూ.. "మగవారిలో అమ్మాయిలకు అన్నింటికంటే ఎక్కువగా నచ్చేది ఏంటి?" అని అడిగారు.

అప్పుడు ఆడియన్స్ నుంచి ఒక వ్యక్తి "పైసా (డబ్బు)!" అని మహిళలను కించపరిచేలా కామెంట్ చేశాడు. ఆ సమయంలో తీవ్ర అసహనానికి గురైన అలియా.. ఆ మాట ఎవరు అన్నారని వెతుకుతుండగా, సమయ్ రైనా అందుకొని.. "కచ్చితంగా ఎవరో ఒక పేదవాడే ఆ మాట అని ఉంటాడు" అంటూ ఆ కామెంట్‌ను కామెడీగా మార్చేశారు.

మహిళల గురించి తక్కువ చేసి మాట్లాడిన ఆ నెటిజన్‌కు బుద్ధి చెప్పినందుకు అప్పట్లో సమయ్‌పై ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు అదే లైన్‌ను అలియా భట్ రివర్స్‌లో వాడటం విశేషం. కాగా అలియా భట్ లీడ్ రోల్‌లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' ఈ శుక్రవారమే (జూలై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

యష్ రాజ్ స్పై యూనివర్స్

శివ్ రావల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శార్వరి వాఘ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'స్పై యూనివర్స్' లో భాగమే ఈ సినిమా.

పఠాన్, టైగర్, వార్ సిరీస్ చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్లతో రూపొందించారు. ఈ స్పై యూనివర్స్‌లో మహిళా ప్రధానంగా వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe