బాలీవుడ్ వెండితెరపై ‘గర్ల్ నెక్ట్స్ డోర్ (పక్కింటి అమ్మాయి)’ ఇమేజ్‌తో కోట్లాది మంది మనసు గెలుచుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ అమృత రావు. టాలీవుడ్‌లో మహేశ్ బాబు అతిథి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమృత రావు ఆ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు.
శ్రద్ధా కపూర్‌తో

ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో అమృత రావుకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా అమృతకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్, సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్‌తో జ్యూవెలరీ బ్రాండ్ ‘పాల్మోనాస్’ (Palmonas) యాడ్‌లో అమృత మెరిశారు. ఇందులో అమృత యంగ్ లుక్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
బుధవారం (జనవరి 14) విడుదలైన ఈ యాడ్‌లో శ్రద్ధా కపూర్, అమృత రావు మధ్య సాగే ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంటోంది. కొత్త మంగళసూత్ర కలెక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమృతను నియమించే అగ్రిమెంట్‌పై శ్రద్ధా కపూర్ అయిష్టంగానే సంతకం చేయడం, ఇద్దరి మధ్య చిన్నపాటి సరదా వాదన జరగడం ఈ వీడియోలో చూడొచ్చు.
44లో 29 ఏళ్ల యువతిలా
అయితే, ఈ వీడియోలోని కంటెంట్ కంటే అమృత రావు అందమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. 44 ఏళ్ల వయసులోనూ ఆమె 2006లో వచ్చిన 'వివాహ్' సినిమా నాటి రూపంతోనే ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
"అమృత ఏమైనా వాంపైరా (బేతాళి లేదా రక్త పిశాచి)? ఎందుకంటే వివాహ్ నుంచి ఇప్పటివరకు ఏమాత్రం మారలేదు, అసలు ఒక్క రోజైనా వయసు పెరిగినట్టు అనిపించడం లేదు" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, "శ్రద్ధా కపూర్ కంటే అమృత చిన్నపిల్లలా కనిపిస్తోంది" అని మరొకరు రాసుకొచ్చారు. "ఆమెకు 44 ఏళ్లంటే ఎవరూ నమ్మరు.. ఇప్పటికీ 29 ఏళ్ల యువతిలా ఉంది" అంటూ అమృతపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్
ఇకపోతే హిందీలో'ఇష్క్ విష్క్', 'మై హూ నా' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన అమృత రావుకు 'వివాహ్' మూవీ ఇంటి పేరుగా మారిపోయింది. వివాహ్ తర్వాతే తెలుగులో అదే సంవత్సరం మహేష్ బాబుతో అమృత రావు అతిథి సినిమా చేయడం విశేషం.
{{/usCountry}}ఇకపోతే హిందీలో'ఇష్క్ విష్క్', 'మై హూ నా' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన అమృత రావుకు 'వివాహ్' మూవీ ఇంటి పేరుగా మారిపోయింది. వివాహ్ తర్వాతే తెలుగులో అదే సంవత్సరం మహేష్ బాబుతో అమృత రావు అతిథి సినిమా చేయడం విశేషం.
{{/usCountry}}ఇక 2019లో వచ్చిన 'ఠాక్రే' తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమృత రావు 2025లో విడుదలైన 'జాలీ ఎల్ఎల్‌బీ 3' (Jolly LLB 3)తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీలతో కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 170 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
అమృత రావు అందం రహస్యం
కాగా, అమృత రావు తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని ఏదో ఒక రోజు వెల్లడిస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘ఏజ్ లెస్’ బ్యూటీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.