...
...
Next Story

Amrutha Chowdary: బొబ్బట్లు, చేపలు తీసుకొచ్చి ఇచ్చేవారు, నిస్వార్థ ప్రేమను చూశా.. హీరోయిన్ అమృత చౌదరి కామెంట్స్

Amrutha Chowdary Comments In Tortoise Song Launch: రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ టార్టాయిస్. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి నీ పరిచయం అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అమృత చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Sep 7, 2026, 19:10:48 IST
Advertisement

Amrutha Chowdary Comments In Tortoise Song Launch: రాజ్ తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టార్టాయిస్. ఈ సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ అమృత చౌదరి చేసింది. వీరితోపాటు అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు.

టార్టాయిస్ నుంచి నీ పరిచయం సాంగ్ రిలీజ్

బొబ్బట్లు, చేపలు తీసుకొచ్చి ఇచ్చేవారు, నిస్వార్థ ప్రేమను చూశా.. హీరోయిన్ అమృత చౌదరి కామెంట్స్
బొబ్బట్లు, చేపలు తీసుకొచ్చి ఇచ్చేవారు, నిస్వార్థ ప్రేమను చూశా.. హీరోయిన్ అమృత చౌదరి కామెంట్స్

రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించిన టార్టాయిస్ సినిమాను ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మించారు. ఇటీవల టార్టాయిస్ సినిమా నుంచి నీ పరిచయం అనే సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ పాటను సింగర్ చిన్మయి శ్రీపాద ఆలపించగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను రచించారు. రీసెంట్‌గా నీ పరిచయం సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అమృత చౌదరి, హీరో రాజ్ తరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

చాలా ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాం

హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ.. "నీ పరిచయం సాంగ్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ సాంగ్ షూటింగ్ చేసేప్పుడు మేము చాలా ఎంజాయ్ చేశాం. అలాగే మీరూ ఈ పాటను ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను" అని అన్నారు.

"సింగర్ చిన్మయి గారంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో నా పాత్రకు డబ్బింగ్ చెప్పించవచ్చు కదా సార్ అని మా ప్రొడ్యూసర్స్‌ను అడిగాను. నీకు తెలుగు వచ్చు కదా అని వాళ్లు చెప్పేవారు. ఇలాగే మీ సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నా" అని తన స్పీచ్ ముగించింది హీరోయిన్ అమృత చౌదరి.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "మా మూవీ ఒక యూనిక్ థ్రిల్లర్. థియేటర్స్‌లో మిమ్మల్ని కంప్లీట్‌గా ఎంగేజ్ చేస్తుంది. ఈ చిత్రంలో మంచి మెలొడీ సందర్భం వచ్చినప్పుడు అనూప్ గారు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటను అందంగా పాడిన చిన్మయి గారికి, సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్" అని తెలిపాడు.

తక్కువ టైమ్‌లో బిజీ హీరోయిన్ అవుతుంది

"ఈ పాటకు మా డైరెక్టర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఎంతో బాగా తెరకెక్కించాడు. అమృత చాలా తక్కువ టైమ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోతుంది. అవసరాల శ్రీనివాస్, ధన్యతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. త్వరలోనే థియేటర్స్‌లోకి మా మూవీ రాబోతోంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా" అని ఆశాభావం వ్యక్తం చేశాడు హీరో రాజ్ తరుణ్.

ఇదిలా ఉంటే, సస్పైన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న టార్టాయిస్ సినిమాలో రాజ్ తరుణ్, అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణతోపాటు షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శబరి విగ్నేష్ సినిమాటోగ్రాఫర్‌గా, గుళ్లపల్లి మాధవ్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks