Trinadha Rao Nakkina Anakapalli Movie Release Date Announcement: విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకాలపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
రస్టిక్ యాక్షన్ నేపథ్యంతో

ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనకాపల్లి సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల తెలుగు చిత్రసీమలో స్థానిక కథలు, పల్లెటూరి నేపథ్యంతో కూడిన రస్టిక్ యాక్షన్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
ఉత్తారంధ్ర నేటివిటీ, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్
ఉత్తరాంధ్ర నేటివిటీతో రూపుదిద్దుకున్న అనకాపల్లి సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అనకాపల్లి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
ఉత్తరాంధ్ర ప్రజల నుంచి అద్భుత స్పందన
ఈ చిత్రానికి రవితేజ 100 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. అంతేకాకుండా, అనకాపల్లి సినిమాతో దర్శకుడు త్రినాథరావు నక్కిన నటుడిగా కూడా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో దర్శకుడు త్రినాథరావు నక్కిన నటిస్తున్నారు.
అనకాపల్లి ప్రజల కోసం స్పెషల్ ప్రీమియర్
ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆగస్ట్ నెలలోనే అనకాపల్లి స్థానిక ప్రజల కోసం స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. స్థానికుల నుంచి లభించిన అనూహ్య స్పందన, వీక్షకుల ప్రశంసలు చిత్రబృందంలో కొండంత ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పటికే విడుదలైన అనకాపల్లి టీజర్, ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుని సినిమాపై హైప్‌ను పెంచేశాయి.
వినాయక చవితి పండగ వేళ కొత్త పోస్టర్
{{/usCountry}}ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆగస్ట్ నెలలోనే అనకాపల్లి స్థానిక ప్రజల కోసం స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. స్థానికుల నుంచి లభించిన అనూహ్య స్పందన, వీక్షకుల ప్రశంసలు చిత్రబృందంలో కొండంత ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పటికే విడుదలైన అనకాపల్లి టీజర్, ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుని సినిమాపై హైప్‌ను పెంచేశాయి.
వినాయక చవితి పండగ వేళ కొత్త పోస్టర్
{{/usCountry}}వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ సోమవారం (సెప్టెంబర్ 14) ఒక పవర్‌ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రధాన తారాగణమంతా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగుతోపాటు తమిళంలో ఒకేరోజు రిలీజ్
అనకాపల్లి చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పి, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకే రోజు గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.
సాంకేతిక బలగం – తారాగణం
అనకాపల్లి చిత్రంలో త్రినాథరావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మాయా. వి ఛాయాగ్రహణం అందించగా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
నటుడిగా ఏ మేరకు మెప్పిస్తారో
దేవ్ జండ్ అందించిన సంగీతం, ఉదయ్ భాగవతుల సంభాషణలు అనకాపల్లి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. మరి ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నటుడిగా ఏ మేరకు మెప్పిస్తారో ఈ సినిమా ద్వారా చూడాలి.