...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రోజా రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా.. రీ ఎంట్రీపై సీనియర్ హీరోయిన్ కామెంట్స్

Anbe Diana OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా అన్బే డయనా స్ట్రీమింగ్‌కు వచ్చింది. సీనియర్ హీరోయిన్ ఆర్కే రోజా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాలో సరళ అనే పాత్రలో ఆమె నటించారు. అన్బే డయానా ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఆర్కే రోజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Aug 28, 2026, 10:40:34 IST
Advertisement

Anbe Diana OTT Release Today: ఎప్పటికప్పుడు ఓటీటీల్లో డిఫరెంట్ సినిమాలు అలరిస్తూనే ఉంటాయి. అలా ఇవాళ (ఆగస్టు 28) ఓటీటీలోకి రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా వచ్చేసింది. ఇందులో సీనియర్ హీరోయిన్ ఆర్కే రోజా కీలక పాత్ర పోషించింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రోజా రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా.. రీ ఎంట్రీపై సీనియర్ హీరోయిన్ కామెంట్స్
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రోజా రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా.. రీ ఎంట్రీపై సీనియర్ హీరోయిన్ కామెంట్స్

ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆర్కే రోజా కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా వచ్చిన సినిమానే అన్బే డయానా. జూలై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా ఐఎమ్‌బీలో 7.5 రేటింగ్ కూడా దక్కించుకుంది. అలాంటి అన్బె డయానా ఓటీటీ వివరలాపై మంచి క్యూరియాసిటీ నెలకొంది.

చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన ‘అన్బే డయానా’ సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగింద‌నే పాయింట్‌ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు ఏక‌మ‌వుతాయి.

గుర్తింపు కోసం యువకుడి పోరాటం

కుటుంబంలో ఉండే అంచనాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం యువ‌కుడు చేసే ప్రయాణం మధ్య ఎదురయ్యే సంక్లిష్టతలే ఈ కథలో ప్రధాన అంశాలుగా క‌నిపిస్తాయి. మిలియన్-డాలర్ స్టూడియోస్, నియో క్యాసిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ‘అన్బే డయానా’ చిత్రంతో రోజా సెల్వమణి మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు.

ఇందులో ఆర్కే రోజా ప‌రి తల్లి స‌ర‌ళ‌ పాత్రలో కనిపించారు. ప‌రి ఎలవళగన్ కథ రాసి, దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు. రమ్య రంగనాథన్ కథానాయికగా నటించారు. రోజా పాత్ర కథకు మరింత ఆత్మీయతను, భావోద్వేగాన్ని తీసుకొచ్చింది.

అన్బే డయనా ఓటీటీ రిలీజ్

అన్బే డయనా ఓటీటీ రిలీజ్ సందర్భంగా రోజా సెల్వ‌మ‌ణి మాట్లాడుతూ.. "అన్బే డయానా చిత్రంతో మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇవ్వ‌టం నాకెంతో ప్రత్యేకం. ఈ సినిమాలోని ప్రేమ‌, ఆత్మీయ‌త‌, కామెడీ, కుటుంబం, బంధాలు, భిన్నమైన సంస్కృతులను కలిపి చూపించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది" అని అన్నారు.

ఆర్కే రోజా కామెంట్స్

"స‌ర‌ళ‌ పాత్రకు తనదైన వ్యక్తిత్వం, భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాత్రకు జీవం పోయడాన్ని నేను ఆస్వాదించాను. ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటం చాలా ఆనందంగా ఉంది" అని ఆర్కే రోజా చెప్పారు.

"థియేటర్లలో అన్బే డయానా సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులతో పాటు, అక్కడ చూడలేకపోయిన వారు కూడా ఇప్పుడు తమ ఇంటి నుంచే ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. మేం ఈ సినిమా కోసం కలిసి పనిచేసినప్పుడు ఎంతగా ఆస్వాదించామో, అంతే స్థాయిలో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అని సీనియర్ హీరోయిన్ అన్బే డయానా ఆకాంక్షించారు.

సోనీ లివ్ ఓటీటీలో

రోజా సెల్వమణి కమ్‌బ్యాక్ చిత్రం ‘అన్బే డయానా’ను ఇప్పుడు సోనీ లివ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్‌లో చూసి ఆస్వాదించండి అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, కామెడీ, మ‌న నెటివిటీకి, మ‌న‌ సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన అన్బే డయానా సినిమా ఇప్పుడు మరింతగా ఓటీటీ ప్రేక్షకులకు చేరువ కానుందని సోనీ లివ్ పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks