...
...
Next Story

Anumana Pakshi Review: అనుమాన పక్షి రివ్యూ- అనుమానమే ఆయుధం అయితే- హీరోగా రాగ్ మయూర్- రాశి కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Anumana Pakshi Review And Rating In Telugu: 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ, 'సినిమా బండి' ఫేమ్ రాగ్ మయూర్ కాంబినేషన్‌లోని కామెడీ థ్రిల్లర్ అనుమాన పక్షి. అనుమానం ఎక్కువైతే జీవితంలో ఎదురైన పరిణామాలు ఎలా ఉంటాయో అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో నేటి అనుమాన పక్షి రివ్యూలో చూద్దాం.

Published on: Sep 25, 2026, 16:34:49 IST
Advertisement

Anumana Pakshi Review And Rating In Telugu: టాలీవుడ్‌లో వినూత్నమైన కథాంశాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కామెడీకి థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోడైతే థియేటర్లలో వచ్చే వినోదం వేరు. 'డీజే టిల్లు'తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన దర్శకుడు విమల్ కృష్ణ ఈసారి రాగ్ మయూర్ హీరోగా సరికొత్త కామెడీ సినిమాను తెరకెక్కించారు.

అనుమాన పక్షి రివ్యూ

అనుమాన పక్షి రివ్యూ- అనుమానమే ఆయుధం అయితే- హీరోగా రాగ్ మయూర్- రాశి కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
అనుమాన పక్షి రివ్యూ- అనుమానమే ఆయుధం అయితే- హీరోగా రాగ్ మయూర్- రాశి కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

అదే 'అనుమాన పక్షి'. విభిన్నమైన టైటిల్‌తో వచ్చిన అనుమాన పక్షి సినిమా ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. "అనుమానం పెనుభూతం" అనే పాయింట్‌ను నేటి సోషల్ మీడియా ట్రెండ్‌కు ముడిపెడుతూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి అనుమాన పక్షి రివ్యూలో తెలుసుకుందాం.

అనుమానమే అతడి ఆయుధం.. అసలు కథేంటంటే?

సన్నీ (రాగ్ మయూర్)కి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. సమయం సందర్భంతో సంబంధం లేకుండా ప్రతి చిన్న విషయాన్నీ విపరీతంగా అనుమానించడం అతడి నైజం. అంతటితో ఆగకుండా తన మనసులో మెదిలే ప్రతి అనుమానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.

ఈ అలవాటే అతడిని ఊహించని చిక్కుల్లో పడేస్తుంది. సన్నీ పెట్టిన ఒక పోస్ట్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని కశ్మీర్ నుంచి అనంత్ (చరిత్) అనే వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపుతాడు. సన్నీ వెంటనే కశ్మీర్ రాకపోతే ఆత్మహత్య చేసుకుని అతడి పేరే సూసైడ్ నోట్‌లో రాస్తానని హెచ్చరిస్తాడు.

కశ్మీర్ ప్రయాణం.. మలుపు తిరిగిన కథ!

సుజాతకు ఆత్మలతో మాట్లాడే ప్రత్యేక శక్తి ఉండటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. వర్మ మరణం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ అనుమానాల సుడిగుండం నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు? అనంత్‌కు సన్నీ వల్ల జరిగిన నష్టం ఏంటీ? ఆత్మలతో సుజాత ఎలా మాట్లాడగలుగుతుంది? అనేది వెండితెరపైనే చూడాలి.

దర్శకత్వ ప్రతిభ, నటీనటుల పనితీరు

సోషల్ మీడియా యుగంలో యువత వైఖరిని ఎండగడుతూనే, అతి అనుమానం మనిషి జీవితాన్ని ఎంతటి ప్రమాదంలోకి నెడుతుందో దర్శకుడు విమల్ కృష్ణ వినోదాత్మకంగా చూపించారు. హీరోగా రాగ్ మయూర్ తనదైన కామెడీ టైమింగ్, విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. కన్ఫ్యూజన్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన హావభావాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి.

విజువల్ ట్రీట్, టెక్నికల్ అంశాలు

హీరోయిన్‌గా మెరిన్ ఫిలిప్ కన్య పాత్రలో అందంగా కనిపిస్తూ మెప్పించింది. ఆత్మలతో మాట్లాడే మహిళగా సీనియర్ హీరోయిన్ రాశి, పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ కనిపించిన సన్నివేశాలు కథలో ఉత్కంఠను పెంచాయి. ప్రిన్స్, చరిత్, బ్రహ్మాజీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

కశ్మీర్ అందాలను కెమెరామెన్ అద్భుతంగా ఆవిష్కరించగా, శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ సన్నివేశాలకు బలాన్నిచ్చింది. రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ పాటించిన నిర్మాణ విలువలు సినిమాను రిచ్‌గా నిలబెట్టాయి.

తుది తీర్పు

కొత్త తరహా కాన్సెప్ట్‌లు, రాగ్ మయూర్ మార్క్ కామెడీ, కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే సస్పెన్స్ సినిమాలను ఇష్టపడేవారికి 'అనుమాన పక్షి' మంచి ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. అనుమాన పక్షిపై ఓసారి లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks