...
...
Next Story

తల్లి కాబోతున్న అనుష్క, వందేళ్లు వేచి చూశానంటూ పోస్ట్- రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, అనన్య, భూమి శుభాకాంక్షలు!

Anushka Ranjan Pregnant Rakul Preet Pragya Jaiswal Wishes: లవ్ బర్డ్స్ అనుష్క రంజన్, ఆదిత్య సీల్ తల్లిదండ్రులు కానున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత ఈ కపుల్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రకుల్ నుంచి ప్రగ్యా వరకు తెలుగు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.

Published on: May 31, 2026, 18:16:11 IST
Advertisement

Anushka Ranjan Pregnant Rakul Preet Pragya Jaiswal Wishes: బాలీవుడ్ బ్యూటీ అనుష్క రంజన్, నటుడు ఆదిత్య సీల్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ ఐదేళ్ల వైవాహిక జీవితంలోకి సరికొత్త అతిథిని ఆహ్వానించడానికి ఈ స్టార్ జంట సిద్ధమైంది. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మెటర్నిటీ ఫోటోషూట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన జంట.. ‘బాప్’ టీషర్ట్‌తో ఆదిత్య!

తల్లి కాబోతున్న అనుష్క, వందేళ్లు వేచి చూశానంటూ పోస్ట్- రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, అనన్య, భూమి శుభాకాంక్షలు!
తల్లి కాబోతున్న అనుష్క, వందేళ్లు వేచి చూశానంటూ పోస్ట్- రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, అనన్య, భూమి శుభాకాంక్షలు!

దీంతో సినిమా పరిశ్రమకు చెందిన స్నేహితులు, సహచరులు, అభిమానులు ఈ కాబోయే అమ్మానాన్నలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదిత్య సీల్, అనుష్క రంజన్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలలో ఇద్దరూ నలుపు రంగు దుస్తులలో ఎంతో అందంగా మెరిసిపోయారు.

వందేళ్లు వేచి చూశాను

అనుష్క తన బేబీ బంప్‌ను చూపిస్తూ నల్లటి బాడీకాన్ డ్రెస్‌లో కనిపించగా, ఆదిత్య క్యాజువల్ బ్లాక్ టీషర్ట్ ధరించాడు. ఆ టీషర్ట్‌పై హిందీలో ‘బాప్’ (తండ్రి) అని రాసి ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక ఫోటోలో అనుష్క బేబీ బంప్‌ను ఆదిత్య ప్రేమగా పట్టుకుని ఇద్దరూ నవ్వుతూ కనిపించిన దృశ్యం అభిమానుల మనసు దోచుకుంటోంది.

"నీ కోసం నేను వందేళ్లు వేచి చూశాను, నీ కోసం మరో మిలియన్ ఏళ్లయినా ఎదురుచూస్తాను. నీ దాన్ని అయ్యే భాగ్యం నా జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో నేనస్సలు ఊహించలేదు" అని ఈ ఫోటోలకు వారు ఎమోషనల్ క్యాప్షన్ పెట్టారు అనుష్క, ఆదిత్య దంపతులు.

తెలుగు సెలబ్రిటీల శుభాకాంక్షలు..

ఈ గుడ్ న్యూస్ వినగానే సినీ సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ చెప్తూ కామెంట్లు పెడుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు అనన్య పాండే, మౌనీ రాయ్, భూమి పెడ్నేకర్ వంటి తారలు స్పందించారు.

"ఈ విషయాన్ని అందరితో పంచుకోవడానికి మాకు కొంత సమయం కావాలని అనుకున్నాం. అందుకే కాస్త ఆలస్యమైంది. నిజం చెప్పాలంటే నా పెళ్లి వార్తను ప్రకటించడం కంటే ఈ గుడ్ న్యూస్ చెప్పేటప్పుడే ఎక్కువ టెన్షన్ పడ్డాను. కానీ, ఇప్పుడు మా స్నేహితులు, అభిమానుల నుంచి వస్తున్న స్పందన చూశాక మనసంతా ప్రశాంతంగా ఉంది" అని అనుష్క తన ఆనందాన్ని పంచుకుంది.

పారిస్‌లో ప్రపోజల్.. ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్

ఆదిత్య, అనుష్కల ప్రేమకథ 2017లో మొదలైంది. ఒక ఈవెంట్‌లో కలుసుకున్న వీరు కొద్ది రోజుల్లోనే డేటింగ్ ప్రారంభించారు. మూడేళ్ల పాటు కలిసి ఉన్నాక, అనుష్క పుట్టినరోజున పారిస్ ట్రిప్‌లో ఆమెకు ఆదిత్య పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఆ తర్వాత 2021 నవంబర్‌లో ముంబైలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

పెళ్లి ఫొటోలు వైరల్

అలియా భట్, వాణీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు హాజరైన ఆదిత్య, అనుష్క పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాను ఊపేశాయి. అప్పటి నుంచి ఒకరికొకరు తోడుగా ఉంటూ వస్తున్న ఈ జంట, ఇప్పుడు తమ జీవితంలోకి రాబోతున్న కొత్త ప్రాణం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe