Anushka Sharma Dating Rules On Money: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ లవ్‌లైఫ్, ఆమె వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒకే నిబంధనకు కట్టుబడి

కేవలం నటిగానే కాకుండా, తనకంటూ కొన్ని బలమైన సిద్ధాంతాలు ఉన్న స్వతంత్ర మహిళగా అనుష్క శర్మ పేరు తెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీతో పెళ్లికి ముందు కొందరు నటులతో రిలేషన్‌షిప్‌లో అనుష్క ఉందని వినిపించినప్పటికీ, డేటింగ్ విషయంలో ఆమె ఎప్పుడూ ఒకే నిబంధనకు కట్టుబడి ఉండేవారు.
డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లును ఎప్పుడూ సగం పంచుకోవడం (స్ల్పిట్ చేయడం) అనుష్క శర్మకు అలవాటు. మగాళ్ల దగ్గర నుంచి బహుమతులు తీసుకోవడానికి కూడా ఆమె ఇష్టపడేవారు కాదట. దీనికి సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ప్రత్యక్షమై హల్‌చల్ చేస్తోంది.
ఇబ్బందిగా ఫీల్ అవుతాను
"నాకు ఈ గిఫ్ట్‌ల సంస్కృతి చాలా వింతగా, నచ్చనిదిగా అనిపిస్తుంది. ఎవరైనా నాకు బహుమతి ఇస్తే చాలా ఇబ్బందిగా ఫీలవుతాను" అని అనుష్క శర్మ ఆ పాత ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2011లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించిన 'లేడీస్ వర్సెస్ రికీ బాల్' సినిమా ప్రమోషన్ల సమయంలో అనుష్క ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ ఎవరైనా బలవంతంగా బహుమతి ఇస్తే, తను ఆ వస్తువు ధర ఎంతో తెలుసుకుని, దానికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ విలువైన వస్తువును తిరిగి వారికి బహుమతిగా ఇచ్చేదాన్ని అని అనుష్క శర్మ వివరించారు.
పట్టింపు ఎక్కువ
"ఏ మగాడూ నాపై డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పుకోకూడదు. ఆ విషయంలో నాకు పట్టింపు ఎక్కువ. హోటల్‌కు వెళ్తే బిల్లు సగం కట్టాల్సిందే. నేను అవతలి వ్యక్తిని బిల్లు కట్టనివ్వను. నేనే మొత్తం కడతాను లేదా సగం పంచుకుంటాను. ఈ విషయాల్లో నాకు చాలా క్లారిటీ ఉంది" అని అనుష్క శర్మ స్పష్టం చేశారు.
రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం.. విరాట్‌తో పెళ్లి
{{/usCountry}}"ఏ మగాడూ నాపై డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పుకోకూడదు. ఆ విషయంలో నాకు పట్టింపు ఎక్కువ. హోటల్‌కు వెళ్తే బిల్లు సగం కట్టాల్సిందే. నేను అవతలి వ్యక్తిని బిల్లు కట్టనివ్వను. నేనే మొత్తం కడతాను లేదా సగం పంచుకుంటాను. ఈ విషయాల్లో నాకు చాలా క్లారిటీ ఉంది" అని అనుష్క శర్మ స్పష్టం చేశారు.
రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం.. విరాట్‌తో పెళ్లి
{{/usCountry}}2010లో 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాతో రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అనుష్క శర్మతో ఆయన ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ చూసి వీరి మధ్య ఏదో నడుస్తోందని అందరూ ఊహించారు. కానీ, కొన్నాళ్లకే వీరిద్దరూ విడిపోయారు.
క్రేజీ సెలబ్రిటీ జంటగా
ఆ తర్వాత 2013లో ఒక షాంపూ ప్రకటన షూటింగ్ సమయంలో అనుష్క శర్మకు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, దేశంలోనే అత్యంత క్రేజీ సెలబ్రిటీ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు.
2016లో వీరి మధ్య చిన్న మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లు వార్తలు వచ్చినా, ఆ తర్వాత మళ్లీ ఒకటయ్యారు. డిసెంబర్ 2017లో ఇటలీలోని టస్కనీలో అత్యంత సన్నిహితుల సమక్షంలో విరాట్, అనుష్క వివాహం వైభవంగా జరిగింది. ఈ దంపతులకు 2021లో కుమార్తె వామిక, 2024లో కుమారుడు అకాయ్ జన్మించారు.
పెళ్లయ్యాక సినిమాలకు దూరం..
విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత అనుష్క శర్మ క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. తన వ్యక్తిగత జీవితానికి, పిల్లల పెంపకానికే ఆమె మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. 2018లో షారుఖ్ ఖాన్ సరసన నటించిన 'జీరో' సినిమానే ఆమె పూర్తిస్థాయిలో నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత 2022లో వచ్చిన 'కాలా' సినిమాలో కేవలం ఒక చిన్న అతిథి పాత్రలో మెరిశారు.
ఆగిపోయిన నెట్‌ఫ్లిక్స్ బయోపిక్ మూవీ
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ జులన్ గోస్వామి బయోపిక్ 'చక్దా ఎక్స్‌ప్రెస్' సినిమాలో అనుష్క లీడ్ రోల్ పోషించారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్, అనుష్కకు చెందిన నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ మధ్య వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఈ సినిమా విడుదల నిరవధికంగా నిలిచిపోయింది.