AR Rahman About Rockstar Songs: భారతీయ సినీ సంగీత చరిత్రలో 'రాక్‌స్టార్' (2011) ఒక మైలురాయి. తెలుగు సహా దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల ప్లేలిస్టులలో ఇప్పటికీ ఆ పాటలు మారుమోగుతూనే ఉంటాయి. అలాంటి కల్ట్ ఆల్బమ్ అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కు, ఆ సినిమా విడుదలైన తర్వాత కూడా 8 నెలల పాటు ఒక్క రూపాయి కూడా పారితోషికం అందలేదంటే నమ్మగలరా? అవును, స్వయంగా రెహమాన్ ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

డెహ్రాడూన్ లిటరేచర్ ఫెస్టివల్ 8వ ఎడిషన్‌లో భాగంగా దర్శకుడు ఇంతియాజ్ అలీతో కలిసి ఏఆర్ రెహమాన్ ఒక ప్రత్యేక చిట్ చాట్‌లో పాల్గొన్నారు. తమ 15 ఏళ్ల విజయవంతమైన ప్రయాణంలో 'రాక్‌స్టార్', 'హైవే' వంటి చిత్రాల వెనుక జరిగిన పలు ఆసక్తికర, విస్మయపరిచే సంఘటనలను వీరిద్దరూ ప్రేక్షకులతో పంచుకున్నారు.
జేబు నుంచే ఖర్చు పెట్టుకున్న రెహమాన్
'రాక్‌స్టార్' సినిమాకు పనిచేసే సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఏఆర్ రెహమాన్ గుర్తుచేసుకున్నారు. రాక్‌స్టార్ సినిమా పాటలు నిర్మాతకు ఏమాత్రం నచ్చలేదని, అందుకే సినిమా విడుదలైన 8 నెలల వరకు తనకు పేమెంట్ ఇవ్వలేదని ఏఆర్ రెహమాన్ తెలిపారు.
"రాక్‌స్టార్ సినిమా మొత్తానికి నిర్మాత నాకు డబ్బులు ఇవ్వలేదు. 'నాకు ఈ సంగీతం నచ్చలేదు' అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ సమయంలో నా ప్రయాణ ఖర్చులతో పాటు సంగీతకారుల పారితోషికాలను నేనే సొంతంగా చెల్లించాను. కనీసం ఒక్క పైసా కూడా అందలేదన్న విషయాన్ని నేను దర్శకుడు ఇంతియాజ్ అలీకి కూడా చెప్పలేదు" అని ఏఆర్ రెహమాన్ వివరించారు. ఎట్టకేలకు సినిమా విడుదలైన 8 నెలల తర్వాత నిర్మాత తనకు చెక్కు ఇచ్చారని ఆయన వెల్లడించారు.
దర్గాలో వీడిన మిస్సింగ్ మిస్టరీ!
'రాక్‌స్టార్' మేకింగ్ సమయంలో రెహమాన్, ఇంతియాజ్ అలీ మధ్య పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు కాంటాక్ట్ అవ్వలేక, అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా లేదా అన్న సందిగ్ధంలో పడ్డారు. రెహమాన్ తన సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదని, మొహమాటంతోనే 'నో' చెప్పలేకపోతున్నారని ఇంతియాజ్ అలీ భావించారు. కానీ అప్పటికే రెహమాన్ రెండు పాటలు పూర్తి చేసి, మరో మూడు ట్యూన్స్ సిద్ధం చేసుకున్నారు.
{{/usCountry}}'రాక్‌స్టార్' మేకింగ్ సమయంలో రెహమాన్, ఇంతియాజ్ అలీ మధ్య పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు కాంటాక్ట్ అవ్వలేక, అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా లేదా అన్న సందిగ్ధంలో పడ్డారు. రెహమాన్ తన సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదని, మొహమాటంతోనే 'నో' చెప్పలేకపోతున్నారని ఇంతియాజ్ అలీ భావించారు. కానీ అప్పటికే రెహమాన్ రెండు పాటలు పూర్తి చేసి, మరో మూడు ట్యూన్స్ సిద్ధం చేసుకున్నారు.
{{/usCountry}}ఈ గందరగోళానికి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దర్గాలో తెరపడింది. షూటింగ్ లొకేషన్ల వేటలో భాగంగా ఇంతియాజ్ అలీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ దర్గాకు వెళ్లారు. అక్కడ దర్గా నిర్వాహకుల ద్వారా రెహమాన్ ఆ దర్గా నేపథ్యంలో ఒక పాట కంపోజ్ చేస్తున్నారని తెలిసింది.
కథలో దర్గాకు ప్రాధాన్యత ఉండటంతో, రెహమాన్ తమ సినిమా కోసమే పనిచేస్తున్నారని ఇంతియాజ్ అలీకి అర్థమైంది. వెంటనే రెహమాన్‌కు ఫోన్ చేయగా, "అవును, మనం ఈ సినిమా చేస్తున్నాం కదా! నేను ఇప్పటికే మూడు పాటలు కూడా సిద్ధం చేశాను" అని రెహమాన్ బదులివ్వడంతో ఇంతియాజ్ అలీ ఊపిరి పీల్చుకున్నారు.
ఒక్క పాట అనుకుంటే 14 పాటలయ్యాయి!
'రాక్‌స్టార్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో అద్భుత చిత్రం 'హైవే' (2014). ఈ సినిమాకు ముందుగా కేవలం ఒక్క పాట మాత్రమే ఉంటుందని ఇంతియాజ్ అలీ అనుకున్నారు.
"రాక్‌స్టార్ తర్వాత రెహమాన్ నాకు స్కైప్‌లో కాల్ చేసి కొత్త సినిమా ఏమైనా చేస్తున్నావా అని అడిగారు. 'సర్, ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది' అని నేను చెప్పాను. 'పర్వాలేదు, కథేంటో చెప్పు' అని ఆయన అన్నారు. అలా మొదలైన ప్రయాణంలో ఒక పాట కాస్తా ఏకంగా 14 పాటలకు చేరింది. ఇప్పుడు రాక్‌స్టార్ కంటే హైవేలోనే ఎక్కువ పాటలు ఉన్నాయి" అని ఇంతియాజ్ అలీ చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి.
1995లో మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ చిత్రం 'బొంబాయి' విషయంలోనూ ఇలాగే జరిగిందని రెహమాన్ గుర్తుచేశారు. కేవలం 20 రోజుల్లో పాటల్లేని డాక్యుమెంటరీ తరహా చిత్రంగా తీయాలనుకున్న 'బొంబాయి'లో చివరకు 5 అద్భుతమైన పాటలు చేరాయని తెలిపారు.
నచ్చని పాటే సూపర్ హిట్!
సంగీతంలో ఏ పాట ఎప్పుడు హిట్ అవుతుందో అంచనా వేయలేమని రెహమాన్ అన్నారు. 'రాక్‌స్టార్'లోని 'షహర్ మే హూన్ మై తేరే' పాటను తాము అంతగా ఇష్టపడలేదని చెప్పారు. "మేము చాలా సాధారణంగా, మాకు అంతగా నచ్చని విధంగా చేసిన ఆ పాటే సూపర్ హిట్ అయ్యింది. యూఏఈలో ఏకంగా నాలుగు నెలల పాటు ఆ పాట నంబర్ వన్ స్థానంలో నిలిచింది" అని రెహమాన్ నవ్వుతూ చెప్పారు.
తమాషా (2015), అమర్ సింగ్ చంకీలా (2024), ఇటీవల వచ్చిన 'మై వాపస్ ఆవుంగా' వరకు వీరిద్దరి ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. "మీలాంటి దర్శకుడితో పనిచేసినప్పుడు కలిగే సంతృప్తి వల్ల వేరే సినిమాలు చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది" అని ఇంతియాజ్ అలీని ఉద్దేశించి రెహమాన్ ప్రశంసించారు.
నేటితో ముగింపు
మూడు రోజుల పాటు సాగిన ఈ డెహ్రాడూన్ లిటరేచర్ ఫెస్టివల్ నేడు ఆదివారం (నవంబర్ 29)తో ముగియనుంది. ఇందులో విశాల్ భరద్వాజ్, రేఖా భరద్వాజ్, షబానా అజ్మీ, రత్న పాఠక్ షా, రాజ్ బబ్బర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.