...
...
Next Story

Sshura Khan: ఆ ముసలోడితో నువ్వు సంతోషంగానే ఉన్నావా? భర్తపై కామెంట్- గట్టి కౌంటర్ ఇచ్చిన జై చిరంజీవ విలన్ భార్య!

Sshura Khan Reply On Arbaaz Khan Old Man Comment: జై చిరంజీవి సినిమా విలన్, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను ముసలోడంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్ చేసిన నెటిజన్‌కు అతని భార్య షురా ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో షురా ఖాన్ పేరు బాలీవుడ్‌లో మారుమోగిపోతుంది.

Published on: Jun 15, 2026, 13:28:53 IST
Advertisement

Sshura Khan Reply On Arbaaz Khan Old Man Comment: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి వయసు వ్యత్యాసాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమ కంటే వయసులో చాలా పెద్దవారైన హీరోలను పెళ్లాడిన స్టార్ వైఫ్స్ నిరంతరం నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటూనే ఉంటారు.

భర్త వయసుపై ట్రోలింగ్

ఆ ముసలోడితో నువ్వు సంతోషంగానే ఉన్నావా? భర్తపై కామెంట్- గట్టి కౌంటర్ ఇచ్చిన జై చిరంజీవ విలన్ భార్య!
ఆ ముసలోడితో నువ్వు సంతోషంగానే ఉన్నావా? భర్తపై కామెంట్- గట్టి కౌంటర్ ఇచ్చిన జై చిరంజీవ విలన్ భార్య!

తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ నటుడు, నిర్మాత, జై చిరంజీవ మూవీ విలన్ అర్బాజ్ ఖాన్ భార్య షురా ఖాన్ (Sshura Khan) చేరారు. తన భర్త వయసుపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెటిజన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యకు షురా తనదైన శైలిలో అదిరిపోయే సమాధానం ఇచ్చారు.

ఆదివారం (జూన్ 14) నాడు షురా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో ముచ్చటించారు. ఒక 'క్యూ అండ్ ఏ' (Q&A) సెషన్‌ను నిర్వహించి నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ వారిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని టార్గెట్ చేస్తూ హద్దులు దాటాడు.

సంతోషంగానే ఉన్నావా?

ప్రస్తుతం 58 ఏళ్ల వయసున్న అర్బాజ్ ఖాన్‌ను ఉద్దేశిస్తూ.. "ఆ ముసలాడితో నువ్వు సంతోషంగానే ఉన్నావా?" అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేసి వెటకారంగా ప్రశ్నించాడు. ఈ వెటకారపు ప్రశ్నకు షురా ఖాన్ అస్సలు తగ్గలేదు. కోప్పడకుండానే సదరు ట్రోలర్ ముఖం పగిలిపోయేలా గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆయన ముసలోడు కాదు.. వింటేజ్ మోడల్!

ఇదే సెషన్‌లో మరో నెటిజన్.. "అర్బాజ్ ఖాన్‌తో మొదటి డేటింగ్‌కు వెళ్లడానికి గల కారణం ఏంటి?" అని ప్రశ్నించగా.. "నేను ఆయనతో ఒక పందెం (Bet) కాసి ఓడిపోయాను. అందుకే రూల్ ప్రకారం ఆయనకు డిన్నర్ ట్రీట్ ఇవ్వాల్సి వచ్చింది" అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అలాగే మీ వైవాహిక జీవితం ఎలా సాగుతోంది అని అడగ్గా.. "మస్త్" (అద్భుతంగా ఉంది) అని క్లుప్తంగా తేల్చేశారు.

కూతురి పేరు వెనుక సలీం ఖాన్

గతేడాది అక్టోబర్ 5 (2025)న అర్బాజ్, షురా దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు 'సిపారా ఖాన్' అని నామకరణం చేశారు. ఈ పేరును ఎవరు ఎంపిక చేశారని ఒకరు అడగ్గా.. అర్బాజ్ ఖాన్ తండ్రి, లెజెండరీ రైటర్ సలీం ఖాన్ (సలీం అంకుల్) ఈ పేరు పెట్టారని షురా స్పష్టం చేశారు.

అలాగే మాతృత్వం ఎలా ఉందన్న ప్రశ్నకు.. "ఇదొక మ్యాజికల్ జర్నీ.. అదే సమయంలో ప్రతి 12 సెకన్లకు ఒకసారి పిలుపు వస్తూ ఉండటంతో తీవ్ర అలసటగా, వినోదభరితంగా సాగుతోంది" అని ఎమోషనల్ అయ్యారు షురా ఖాన్.

సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్

ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అయిన షురా ఖాన్.. 'పాట్నా శుక్లా' సినిమా షూటింగ్ సమయంలో అర్బాజ్ ఖాన్‌ను కలుసుకున్నారు. చాలా కాలం పాటు తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట, 24 డిసెంబర్ 2023 న ముంబైలోని అర్పియా ఖాన్ నివాసంలో అత్యంత ఆప్తుల మధ్య ముస్లిం సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.

మలైకా అరోరా తర్వాత

సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఖాన్‌కు ఇది రెండో వివాహం కాగా, అంతకుముందు ఆయన మలైకా అరోరాను పెళ్లాడిన విషయం తెలిసిందే. వీరికి అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు.

నెటిజన్‌కు రిప్లై ఇచ్చిన అర్బాజ్ ఖాన్ భార్య షురా ఖాన్

మలైకాతో విడాకుల తర్వాత జియోర్జియా ఆండ్రియానితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అర్బాజ్, చివరకు షురాను వివాహం చేసుకుని స్థిరపడ్డారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe