...
...
Next Story

Avika Gor Asthma: చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది, అప్పుడు ఎలిమినేట్ చేశారు.. చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కామెంట్స్

Avika Gor About Asthma And Stunts: తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని షాకింగ్ విషయం బయటపెట్టింది చిన్నారి పెళ్లికూతురు, తెలుగు హీరోయిన్ అవికా గోర్. ఏడేళ్ల విరామం తర్వాత ఓటీటీ స్టంట్ షోలోకి అడుగుపెట్టిన అవికా తన పాత చేదు అనుభవాలను, ఆరోగ్య సమస్యలను పంచుకున్నారు. అవికా గోర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 3, 2026, 11:00:45 IST
Advertisement

Avika Gor About Asthma And Stunts: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన నటి అవికా గోర్ మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. పాపులర్ స్టంట్ రియాలిటీ ఓటీటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' లో అవికా గోర్ పోటీదారుగా బరిలోకి దిగారు.

ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ

చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది, అప్పుడు ఎలిమినేట్ చేశారు.. చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కామెంట్స్
చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది, అప్పుడు ఎలిమినేట్ చేశారు.. చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కామెంట్స్

గతంలో 2019లో వచ్చిన ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 9లో పాల్గొన్న అవికా గోర్ ఏడేళ్ల తర్వాత మళ్లీ అదే ఓటీటీ షోలోకి పునరాగమనం చేశారు. ఈ క్రమంలో షోలో తను ఎదుర్కొంటున్న మానసిక, శారీరక సవాళ్ల గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

భయాన్ని జయించినా.. ఆ వ్యాధి వల్ల తప్పని కష్టం

గత సీజన్‌తో పోలిస్తే ఈసారి టాస్కులు కొంత సులువుగానే అనిపించినప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్టంట్ మాత్రం తనకు చుక్కలు చూపించిందని అవికా గోర్ చెప్పారు. చిన్నప్పటి నుంచి తనకు ఉన్న ఆస్తమా (ఉబ్బసం) సమస్య వల్ల గ్యాస్ ఆధారిత టాస్కులు చేయడం అసాధ్యంగా మారిందని తెలిపారు.

చిన్నతనం నుంచి ఆస్తమా

"చిన్నతనం నుంచే నాకు ఆస్తమా ఉంది. టియర్ గ్యాస్ (బాష్పవాయువు) ఉపయోగించే స్టంట్లు చేయాలంటే ఊపిరితిత్తులు చాలా బలంగా ఉండాలి. శ్వాస నియంత్రణ చాలా అవసరం. 9వ సీజన్‌లో కూడా టియర్ గ్యాస్ స్టంట్ వల్లే నేను షో నుంచి ఎలిమినేట్ అయ్యాను. ఈసారి కూడా అలాంటి టాస్క్ వచ్చినప్పుడు నేను ఎంత ప్రయత్నించినా మిగతా వారితో పోటీ పడలేనని అర్థమైంది" అని అవికా గోర్ తన మానసిక భయాన్ని (Trauma) బయటపెట్టారు.

తోటి పోటీదారుల గాయాలు చూసి కన్నీళ్లు

అయితే ఈ ప్రయాణంలో తోటి నటీనటులు జాస్మిన్ భాసిన్, రుబీనా దిలైక్, రిత్విక్ ధంజానీ, కరణ్ వాహి తనకు కొండంత అండగా నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో కలర్స్ టీవీతో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారమవుతోంది.

టీవీ సీరియల్స్‌కి రీ ఎంట్రీ

మరోవైపు ఆగస్టు 7న విడుదల కానున్న ఒక పంజాబీ మ్యూజిక్ వీడియోలో అవికా గోర్ నటించారు. త్వరలోనే మళ్లీ టీవీ సీరియళ్లలోకి కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అవికా గోర్ సూచనప్రాయంగా వెల్లడించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అవికా గోర్ ఏడేళ్ల తర్వాత ఏ రియాలిటీ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు?

అవికా గోర్ ప్రముఖ సాహస రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' 15వ సీజన్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.

2. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో అవికా గోర్‌కు ఏ స్టంట్ చేయడం కష్టంగా మారింది?

చిన్నప్పటి నుంచి ఆస్తమా సమస్య ఉండటం వల్ల టియర్ గ్యాస్ (బాష్పవాయువు) ఆధారిత స్టంట్లు చేయడం ఆమెకు అత్యంత కష్టంగా మారింది.

3. 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' షోకి హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారు?

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఈ షోకి వ్యాఖ్యాతగా (హోస్ట్) వ్యవహరిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe