OTT Romantic Crime Action Thriller Awarapan 2 Trending In Top 1 Place: బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఆవారాపన్ 2 ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ఓజీ విలన్ ఇమ్రాన్ హాష్మీ, కల్కి హీరోయిన్ దిశా పటానీ, షబానా అజ్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఆవారాపన్ 2 ఓటీటీలో ఆకట్టుకుంటోంది.
ఓటీటీ రిలీజ్ నుంచే టాప్ 1లో

ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది ఆవారాపన్ 2 సినిమా. థియేటర్లలో సందడి చేసిన కొన్ని వారాలకే ఆవారాపన్ 2 సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రావడం విశేషం.
కల్ట్ క్లాసిక్‌కు సీక్వెల్.. భారీ వసూళ్లు
2007లో విడుదలైన 'ఆవారాపన్' చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, కాలక్రమేణా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ముఖ్యంగా అందులోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.
దాదాపు రెండు దశాబ్దాల (20 ఏళ్లు) తర్వాత వచ్చిన ఈ సీక్వెల్‌పై హిందీతో పాటు దక్షిణాది ప్రేక్షకుల్లోనూ నార్త్-సౌత్ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆగస్టులో థియేటర్లలోకి వచ్చిన ఆవారాపన్ 2 సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 213.01 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
శివం పండిట్‌గా ఇమ్రాన్ హాష్మీ రీ-ఎంట్రీ
దర్శకుడు నితిన్ కక్కర్ తెరకెక్కించిన ఈ సీక్వెల్‌లో ఇమ్రాన్ హాష్మీ తన ఐకానిక్ పాత్ర 'శివం పండిట్'గా మరోసారి లీడ్ రోల్ పోషించారు. రాజస్థాన్‌లోని ఒక మారుమూల గ్రామంలో తన ప్రేయసి ఆలియా సమాధి వద్ద గతం తలచుకుంటూ ఒంటరిగా గడిపే శివం జీవితంతో కథ ప్రారంభమవుతుంది. నేర ప్రపంచానికి దూరంగా, పశ్చాత్తాపంతో కాలం వెళ్లదీస్తున్న అతని జీవితంలోకి అనుకోకుండా ఒక బంధం ప్రవేశిస్తుంది.
అయితే విధి ఆడిన వింత నాటకంలో శివం మళ్లీ బ్యాంకాక్ క్రైమ్ కార్టెల్ వార్‌లోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. తాను వదిలేశాననుకున్న చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టి, తన వారి కోసం అతను చేసిన పోరాటమే ఆవారాపన్ 2 చిత్ర ప్రధానాంశం. ఈ సినిమాలో సువిందర్ విక్కీ, పూరన్ గబ్బీ, విజయ్ కోహ్లీ కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీలోకి ఆవారాపన్ 2
{{/usCountry}}అయితే విధి ఆడిన వింత నాటకంలో శివం మళ్లీ బ్యాంకాక్ క్రైమ్ కార్టెల్ వార్‌లోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. తాను వదిలేశాననుకున్న చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టి, తన వారి కోసం అతను చేసిన పోరాటమే ఆవారాపన్ 2 చిత్ర ప్రధానాంశం. ఈ సినిమాలో సువిందర్ విక్కీ, పూరన్ గబ్బీ, విజయ్ కోహ్లీ కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీలోకి ఆవారాపన్ 2
{{/usCountry}}ఇంతటీ క్రేజ్ తెచ్చుకున్న ఆవారాపన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆవారాపన్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. అక్టోబర్ 9 అంటే నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఆవారాపన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా రిలీజ్ అయిన రోజు నుంచే టాప్ 1 స్థానంలో ప్రైమ్ వీడియోలో ఆవారాపన్ 2 ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.
ప్రైమ్ వీడియో ప్రచార వీడియో వైరల్
అయితే, ఆవారాపన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇమ్రాన్ హాష్మీ తన హిట్ పాట 'తో ఫిర్ ఆవో' వింటూ సీరియస్ లుక్‌తో నడుచుకుంటూ వెళ్తున్న ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
"మరొకసారి శివం పండిట్‌ను కలవడానికి సిద్ధంగా ఉండండి" అని ప్రైమ్ వీడియో పేర్కొంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఒకవైపు మొత్తం బాలీవుడ్ ఉంటే, మరోవైపు ఇమ్రాన్ హాష్మీ ఉంటారు" అని ఒక అభిమాని కామెంట్ చేయగా, "ఇమ్రాన్ హాష్మీ మాట్లాడాల్సిన అవసరం లేదు, కేవలం నడిచొస్తే చాలు" అని మరొకరు ప్రశంసించారు.
ఓటీటీలో వీకెండ్ వాచ్‌గా
థ్రిల్లింగ్ యాక్షన్, ఎమోషనల్ కనెక్ట్, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్ కలబోతగా వచ్చిన ఈ సీక్వెల్ ఆవారాపన్ 2 థియేటర్లలో మిస్ అయిన ఓటీటీ ప్రియులకు మంచి వీకెండ్ వాచ్‌గా నిలుస్తుంది.