మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ వచ్చేస్తోంది- మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బాహుబలి ది ఎపిక్- ఆ రెండింట్లో స్ట్రీమింగ్- కానీ!
ఓటీటీలోకి బాహుబలి ది ఎపిక్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎస్.ఎస్. రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి రూపొందించిన ‘బాహుబలి: ది ఎపిక్’ వెర్షన్ రెండు ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా ‘బాహుబలి’. పదేళ్ల క్రితం మొదలైన ఈ సంచలనం ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వస్తోంది. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో ఒకే సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే.

ఓటీటీ తెరపై
థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ స్పెషల్ వెర్షన్ బాహుబలి ది ఎపిక్ ఓటీటీ తెరపై రచ్చ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా మరికొన్ని గంటల్లోనే బాహుబలి ది ఎపిక్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్స్‌కు భారీ క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించింది.
బాహుబలి ది ఎపిక్ ఓటీటీ స్ట్రీమింగ్
‘బాహుబలి: ది ఎపిక్’ వెర్షన్‌ను డిసెంబర్ 25 (గురువారం) అర్థరాత్రి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అంటే, దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. థియేటర్లలో ఈ ఎపిక్ అనుభూతిని మిస్ అయిన వారికి, అలాగే మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని తెలిపింది.
రాజమౌళి మార్క్ ‘రిమాస్టరింగ్’
దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉండే ఈ వెర్షన్ ప్రేక్షకులకు ఏమాత్రం విరామం లేని ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. కేవలం రెండు సినిమాలను కలపడం మాత్రమే కాకుండా ఈ ఎపిక్ వెర్షన్ కోసం రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
రీ రిలీజ్ కలెక్షన్స్‌లో
అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజువల్స్, సౌండ్ క్వాలిటీని మరింతగా మెరుగుపరిచారు. డాల్బీ అట్మాస్ సౌండ్, సరికొత్త కలర్ గ్రేడింగ్‌తో బాహుబలి ది ఎపిక్ సరికొత్త అనుభూతి పంచనుంది. గత అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన బాహుబలి ది ఎపిక్ దాదాపు రూ. 50 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రీ-రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.
పాత కథ-కొత్త కోణం
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి స్టార్ యాక్టర్స్ నటనను నిరంతరాయంగా బాహుబలి ది ఎపిక్ ఓటీటీ రిలీజ్ ద్వారా చూసేయొచ్చు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? శివుడు మహిష్మతి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు? అనే కథను మళ్లీ కొత్త కోణంలో చూడొచ్చు.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా
ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా బాహుబలి ది ఎపిక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంటే, రెండు ఓటీటీల్లో మరికొన్ని గంటల్లో బాహుబలి ది ఎపిక్ ఓటీటీ రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


