...
...
Next Story

Tejaswini: డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని- ఆ కొరియోగ్రాఫర్‌తో స్టెప్పులు- తండ్రిలాగే టైమింగ్!

Balakrishna Daughter Tejaswini Dance Video Viral: నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా దూసుకుపోతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌తో తేజస్విని చేసన డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. దీంతో వీడియో నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది. తండ్రికి తగ్గ కూతురు అంటూ ప్రశంసలు వస్తున్నాయి.

Published on: May 30, 2026, 10:01:51 IST
Advertisement

Balakrishna Daughter Tejaswini Dance Video Viral: తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం, అశేషమైన అభిమాన గణం ఉన్నారు. నటరత్న స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ వెండితెర ప్రస్థానాన్ని ఆయన వారసులు హరికృష్ణ, బాలకృష్ణలతో పాటు మనవళ్లు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు.

సినిమాలకు, మీడియాకు దూరంగా

డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని- ఆ కొరియోగ్రాఫర్‌తో స్టెప్పులు- తండ్రిలాగే టైమింగ్!
డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని- ఆ కొరియోగ్రాఫర్‌తో స్టెప్పులు- తండ్రిలాగే టైమింగ్!

అయితే ఈ తరం నందమూరి ఆడపడుచులు సాధారణంగా లైమ్‌లైట్‌కు, గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగానే ఉంటారు. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా తొలి నుంచి మీడియాకు, సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ, ఇటీవల కాలంలో తేజస్విని వ్యాపార రంగంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.

భాను మాస్టర్‌తో క్రేజీ స్టెప్పులు.. తండ్రికి తగ్గ కూతురు!

తాజాగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌కు గురి చేస్తోంది. ఎప్పుడూ క్లాసీగా, కాస్త రిజర్వ్‌డ్‌గా హోమ్లీ లుక్‌లో కనిపించే తేజస్విని.. తాజాగా తనలోని అసలైన డ్యాన్స్ టాలెంట్‌ను బయటకు తీశారు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి తేజస్విని ఒక పవర్‌ఫుల్ నెంబర్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

ఆ సాంగ్ బీట్స్‌కు తగ్గట్టుగా తేజస్విని చూపించిన గ్రేస్, ఎనర్జీ చూసి నందమూరి అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. "నాన్న పోలికలు వంద శాతం వచ్చాయి.. బాలయ్య లాగే డ్యాన్స్‌లో మంచి టైమింగ్, ఈజ్ ఉన్నాయి" అని నందమూరి ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తేజస్విని వేసిన ఈ స్టెప్స్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

వ్యాపారవేత్తగా.. కాస్ట్యూమ్ డిజైనర్‌గా..

ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను చక్కబెడుతూనే, భర్తకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడంలో తేజస్విని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె నేరుగా సినిమాల్లో నటించకపోయినప్పటికీ, టాలీవుడ్‌కు చాలా దగ్గరగానే ఉంటున్నారు. తన తండ్రి నందమూరి బాలకృష్ణ నటించిన కొన్ని చిత్రాలకు తేజస్విని కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు.

'అన్‌స్టాపబుల్' వెనుక సూత్రధారిగా

వీటన్నింటికంటే ముఖ్యంగా.. ఆహా ఓటీటీలో సరికొత్త రికార్డులు సృష్టించిన 'అన్‌స్టాపబుల్' టాక్ షో వెనుక తేజస్విని ఆలోచనలు, ఆమె నిర్మాణ పర్యవేక్షణే ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహించిన ఈ తెలుగు సెలబ్రిటీ ఓటీటీ టాక్ షో అన్‌స్టాపబుల్ 4 సీజన్లలతో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ

ఇటీవలే తేజస్విని గ్లామర్, కమర్షియల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థ 'సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి తొలిసారిగా ఒక వాణిజ్య ప్రకటన (Commercial Ad)లో నటించారు. ఆ యాడ్‌లో తేజస్విని ట్రెడిషనల్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇలా మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్న తేజస్విని, ఇప్పుడు ఈ లేటెస్ట్ డ్యాన్స్ వీడియోతో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks