టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. గత కొంతకాలంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు తెరదించుతూ, కావ్య రెడ్డి అనే అమ్మాయితో తన బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
అధికారిక ప్రకటన

అయితే, ఈపాటికే కావ్య రెడ్డి అనే యువతితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని కథనాలు వచ్చాయి. కానీ, నిజానికి నిశ్చితార్థం జరగలేదని, అది కేవలం ఒక చిన్న ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమే అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అధికారికంగా చెప్పాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ 'రోకా' (Roka) వేడుక ఘనంగా జరిగింది.
కావ్యమ్మా అంటూ
ఈ సందర్భంగా తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ఫొటోలు షేర్ చేస్తూ కావ్య రెడ్డిని కావ్యమ్మా అని పిలుస్తూ అందమైన నోట్ రాసుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది
"నా కావ్యమ్మకు.. జీవితానికి తనకంటూ ఓ అందమైన సమయం ఉంది. అది నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, నా జీవితాన్ని పాజిటివిటీతో, లెక్కలేనన్ని చిరు నవ్వులతో నింపినందుకు థ్యాంక్స్" అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాసుకొచ్చాడు.
ఎప్పటికీ వాడిపోనివ్వను
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా కొనసాగిస్తూ.. "ఆ చిరునవ్వులను నీ మోముపై కూడా ఎప్పటికీ వాడిపోనివ్వను. మనం ఎప్పటికీ కలిసి జీవించే క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ప్రేమతో నీ శ్రీని" అని పేర్కొన్నాడు.
అది ఎంగేజ్‌మెంట్ కాదు
{{/usCountry}}బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా కొనసాగిస్తూ.. "ఆ చిరునవ్వులను నీ మోముపై కూడా ఎప్పటికీ వాడిపోనివ్వను. మనం ఎప్పటికీ కలిసి జీవించే క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ప్రేమతో నీ శ్రీని" అని పేర్కొన్నాడు.
అది ఎంగేజ్‌మెంట్ కాదు
{{/usCountry}}అలాగే, "ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. అది ఎంగేజ్‌మెంట్ కాదు. కేవలం ఒక చిన్న ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమే. వేడుకలు ఇక ప్రారంభం కానున్నాయి. డేట్స్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. మీ ప్రేమ, సహకారమే నా ప్రపంచం" అంటూ అభిమానులు, ప్రేక్షకుల గురించి రాసుకొచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
ఆరెంజ్ కలర్ చీరలో అందంగా
ఇకపోతే హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుక పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో, ఎంతో ఆత్మీయంగా సాగింది. ఈ ప్రత్యేకమైన రోజున సాయి శ్రీనివాస్ పీచ్ రంగు ఎంబ్రాయిడరీ కుర్తాలో ఎంతో హుందాగా కనిపించగా.. కావ్య రెడ్డి గోల్డ్ వర్క్ ఉన్న ఆరెంజ్ కలర్ చీరలో అందంగా మెరిసిపోయారు.
బోయపాటి శ్రీను-సంయుక్త
ఆదివారం (మార్చి 8) జరిగిన ఈ వేడుకకు డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ తదితర సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. కాగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు కాబోయే భార్య పేరు కావ్య రెడ్డి. హైదరాబాద్ లాయర్ కుటుంబానికి చెందిన కావ్యకు చిత్ర పరిశ్రమతో సంబంధం లేదు.
న్యాయవాది కుమార్తె
కావ్య రెడ్డి ప్రముఖ న్యాయవాది కుమార్తె. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కానీ, ఇది అరెంజ్‌డ్ మ్యారేజ్ అని మరో టాక్ కూడా వినిపిస్తోంది.
అల్లుడు శీను సినిమాతో
ఇదిలా ఉంటే, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన సాయి శ్రీనివాస్.. 'అల్లుడు శీను'తో హీరోగా అరంగేట్రం చేయగా 'రాక్షసుడు' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇటీవల భైరవం, కిష్కింధపురి చిత్రాలతో అలరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ మూవీస్‌తో బిజీగా ఉన్నాడు.